Home పిల్లల ఆరోగ్యం పాప బాగా బరువు పెరుగుతోంది..? ఏం చేయాలి?


 
పాప బాగా బరువు పెరుగుతోంది..? ఏం చేయాలి? PDF Print E-mail

మా పాప వయసు పన్నెండేళ్లు. చాలా బొద్దుగా ఉంటుంది. అయితే పట్టుమని పది మెట్లు కూడా ఎక్కలేకపోతోంది. మందకొడిగా తయారయింది. మా పాప నార్మల్‌గా అయేందుకు తగిన మందులు సూచించగలరు.

ఇటీవల మారిన జీవనశైలితోనూ, పిల్లలు శారీరక శ్రమకు, ఆటలకు తక్కువ సమయం కేటాయించడం, టీవీ, కంప్యూటర్ ఆటలకు అంకితమైపోవడంతో పిల్లల్లో బరువు విపరీతంగా పెరుగుతోంది. వాళ్లు స్థూలకాయులవుతున్నారు. పెద్దలదీ అదే పరిస్థితి.

బరువు తగ్గడానికి హోమియో ఔషధాలు 
కాల్కేరియా కార్బ్: ఊబకాయం ఉండి, త్వరగా అలసట చెందేవారు, వేగంగా నడిచినప్పుడు త్వరగా విపరీతంగా చెమటలు పట్టేవారికి మేలు. అలాగే బాగా లావుగా ఉండి, ఎర్రటి ముఖం, పెద్ద తల ఉన్నవారు, పాలిపోయినట్లుగా ఉండేవారికి ఇది మంచిది. 

గ్రాఫైటిస్: తెల్లగా, లావుగా ఉండి, శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి, రక్తహీనత ఉన్నవారికి, వెంట్రుకల చివర్లలో; గోళ్లలో పగుళ్లు ఉన్నవారికీ, మహిళల్లో రుతుస్రావంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారిలో ఇది మంచి ఔషధం. 

యాంటిమోనియం క్రూడ్: యుక్తవయసులో ఉన్నవారు, పిల్లలు త్వరగా లావెక్కిపోతూ ఉన్నప్పుడు బరువును నియంత్రించడానికి . ఇవేగాక... ఫైటోలెక్కా బెర్రీ, ఫ్యూకస్ వంటి మందులు కూడా హోమియోలో బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.