Warning: session_start() [function.session-start]: Cannot send session cookie - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:2) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: session_start() [function.session-start]: Cannot send session cache limiter - headers already sent (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:2) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:2) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 426
ఆహారం - Aahaaram Vijayawada Online.. The First Vijayawada Information Portal. Tourism, Chat, Free Classifieds, Jobs, Chating, Radio, TV, Education, Games & more.... http://vijayawadaonline.com/aahaaram.html Sat, 23 Oct 2021 10:29:05 +0000 Joomla! 1.5 - Open Source Content Management en-gb Synthetic Milk harmful for Health సింథటిక్ మిల్క్ http://vijayawadaonline.com/aahaaram/821-synthetic-milk.html http://vijayawadaonline.com/aahaaram/821-synthetic-milk.html
This is how synthetic milk is made: 

Synthetic milk is milk produced by mixing of synthetic products like caustic soda, urea, cheap cooking/refined oil and detergents. It was first made by milkmen in Kurukshetra region in Haryana and has since then spread out to all over the country.
]]>
Food Tue, 02 Dec 2014 10:48:02 +0000
డయాబెటిస్‌వారికి ఫిట్‌నెస్ కోసం... http://vijayawadaonline.com/aahaaram/755-diabetes-fitness.html http://vijayawadaonline.com/aahaaram/755-diabetes-fitness.html డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే...

పిండిపదార్థాలు : గోధుమ, వరి వంటి పిండిపదార్థాలు బాగా శక్తినిస్తాయి. ఒక గ్రాము పిండిపదార్థం దాదాపు 4 క్యాలరీల శక్తిని ఇస్తుంది. పిండిపదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ పాళ్లు వేగంగా పెరుగుతాయి. అందుకే డయాబెటిస్ రోగులు పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. పిండిపదార్థాలు తీసుకునే సమయంలో ముడిబియ్యం, దంపుడు బియ్యం లాంటి పొట్టుతీయని ధాన్యాలు తీసుకోవడం వల్ల పీచుపదార్థాలు (ఫైబర్) శరీరానికి ఎక్కువగా అందుతాయి. రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గించడానికి ఈ పీచుపదార్థాలు ఉపయోగపడతాయి. బెండకాయ, వంకాయ, టొమాటో, గుమ్మడికాయ వంటి కాయగూరలు, తోటకూర, బచ్చలికూర, మెంతికూర వంటి ఆకుపచ్చని ఆకుకూరలలో, బొప్పాయి, జామ వంటి పండ్లలో, సజ్జలు, జొన్నలు, బార్లీ, రాగులు, కొర్రలు వంటి ధాన్యాలలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. 

ప్రోటీన్లు : గ్లూకోజ్ పాళ్లు పెరగకుండా చూసే అమినో ఆసిడ్స్‌ను అందిచడంలో ప్రోటీన్లు దోహదపడతాయి. పాలు, పాల ఉత్పాదనలు, పప్పులు, బీన్స్ వంటి వాటిలో ప్రోటీన్లు ఎక్కువ. మాంసాహారం వల్ల కొవ్వు పాళ్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మాంసాహారం తీసుకునే సమయంలో వేటమాంసం, రెడ్ మీట్‌కు బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలు వంటివి మంచిది. 

కొవ్వులు: శరీర జీవక్రియలకు కొవ్వులు అవసరం. కాబట్టి వాటిని పూర్తిగా మానేయడం సరికాదు. కొవ్వుపదార్థాల వల్ల ఎక్కువ క్యాలరీలు ఉత్పన్నం అవుతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసాహారం, నెయ్యి, వెన్న, జున్ను, మీగడ, వనస్పతి, పామోలిన్ వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే అవకాశం ఎక్కువ. డయాటెటిస్ ఉన్నవారు గుండె జబ్బు లేకపోయినా ఉన్నట్లుగా భావించి, జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఇలాంటి కొవ్వు లేదా నూనె పదార్థాలు తీసుకోవడం సరికాదు. 

ఇక వ్యాయామం విషయానికి వస్తే డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి వ్యాయామం చాలా కీలకం. అయితే మీరు గతంలోలా మజిల్ బిల్డింగ్ వ్యాయామాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా శరీరంలోని క్యాలరీలు ఖర్చు అయ్యేలా ఇప్పుడు బ్రిస్క్ వాకింగ్, స్లో జాగింగ్ వంటి వ్యాయామాలు చేయండి. వ్యాయామం మొదలుపెట్టే ముందు ఒకసారి ఫిట్‌నెస్ ఫిజీషియన్‌ను సంప్రదిస్తే మంచిది. ]]>
Food Thu, 04 Jul 2013 20:00:13 +0000
గుండెజబ్బులు, రక్తపోటు నివారణ దానిమ్మగింజల జ్యూస్ http://vijayawadaonline.com/aahaaram/387-danimma-anar-juice.html http://vijayawadaonline.com/aahaaram/387-danimma-anar-juice.html

గుండెజబ్బులు, రక్తపోటు నివారణకు రుచికరమైన మార్గమిది. ప్రతిరోజూ 60 ఎం.ఎల్. తాజా దానిమ్మగింజల జ్యూస్ తాగేవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. మామూలు వ్యక్తులతో పోలిస్తే దానిమ్మగింజల జ్యూస్ తాగేవారిలో సిస్టోలిక్ బల్డ్ ప్రెషర్ 21శాతం తక్కువగా ఉన్నట్లు ఇజ్రాయిల్‌లోని రామ్‌బమ్ మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కాబట్టి ఒకే జ్యూస్‌తో రెండు జబ్బుల (రక్తపోటు, గుండెజబ్బులు) నివారణకు ఈ పసందైన మార్గాన్ని ఎంచుకోడానికి ఎవరికి మాత్రం అభ్యంతరం ఉంటుంది!

]]>
Food Wed, 11 Jul 2012 20:20:46 +0000
ఆహార పదార్ధాలలో తీసుకోదగినవి... తీసుకోకూడని http://vijayawadaonline.com/aahaaram/384-2012-07-11-20-11-04.html http://vijayawadaonline.com/aahaaram/384-2012-07-11-20-11-04.html ఆరోగ్యస్పృహ పెరిగాక చాలామంది ఫలానా పదార్థాలయితే తినవచ్చని, ఫలానావి తినకూడదనే భావన పెరిగింది. వాస్తవానికి తినడానికి ఉద్దేశించిన పదార్థాలలో తినకూడనివంటూ ఏవీ లేవు. అయితే ఆరోగ్యరీత్యా చాలా పరిమితంగా తినాలని అర్థం. ఉదాహరణకు వెన్న, నెయ్యి వంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తినకూడదని చాలామంది అంటుంటారు. కానీ రుచికోసం ఎప్పుడో ఒకసారి చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలన్నది నిపుణుల మాట. ఇలా చూస్తే మనం తీసుకునే ఆహారాల్లో తీసుకోదగినవి... తీసుకోకూడని వాటి జాబితా సంక్షిప్తంగా...

]]>
Food Wed, 11 Jul 2012 19:53:36 +0000