Home ఆహారం గుండెజబ్బులు, రక్తపోటు నివారణ దానిమ్మగింజల జ్యూస్


 
గుండెజబ్బులు, రక్తపోటు నివారణ దానిమ్మగింజల జ్యూస్ PDF Print E-mail

గుండెజబ్బులు, రక్తపోటు నివారణకు రుచికరమైన మార్గమిది. ప్రతిరోజూ 60 ఎం.ఎల్. తాజా దానిమ్మగింజల జ్యూస్ తాగేవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. మామూలు వ్యక్తులతో పోలిస్తే దానిమ్మగింజల జ్యూస్ తాగేవారిలో సిస్టోలిక్ బల్డ్ ప్రెషర్ 21శాతం తక్కువగా ఉన్నట్లు ఇజ్రాయిల్‌లోని రామ్‌బమ్ మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కాబట్టి ఒకే జ్యూస్‌తో రెండు జబ్బుల (రక్తపోటు, గుండెజబ్బులు) నివారణకు ఈ పసందైన మార్గాన్ని ఎంచుకోడానికి ఎవరికి మాత్రం అభ్యంతరం ఉంటుంది!