Home ఆరోగ్యం పాజిటివ్ వైద్యమే హోమియోపతి ప్రత్యేకత


 
పాజిటివ్ వైద్యమే హోమియోపతి ప్రత్యేకత PDF Print E-mail
జరిగితే జ్వరమంత సుఖం లేద’ని తెలుగులో ఒక సామెత’. కానీ అది పూర్తిగా తప్పని నిరూపిస్తాయి రోగి పాటించాల్సిన నిబంధనలు. జబ్బు పడ్డప్పట్నుంచీ రోగిపై ఎన్నో ఆంక్షలు. నోటికి ఎన్నో అడ్డంకులు. రుచికి ఎన్నో చేదుమందులు. రోగి జీవితాన్ని నరకప్రాయం చేస్తాయవి. ఇక అదే తెలుగులో మరో సామెత కూడా ఉంది... ‘‘రోగి కోరిందీ... వైద్యుడు ఇచ్చేదీ ఒకటే అయితే ఇంక చెప్పేదేముంది?’’ అని. బహుశా శామ్యూల్ హనీమన్‌కు ఇది తెలిసే ఉంటుందేమో!. అందుకే అలనాటి మన హనుమానుడు సంజీవని తెచ్చినట్లుగా... ఈ జర్మన్ హనీమనుడు కొత్త సంజీవనులను తీసుకొచ్చాడు. మదీయ హనుమంతుడు కొండనే పెరుక్కువచ్చిన మహనీయుడైతే... ఈ జర్మనీయ హనీమనుడు అంకురం నుంచి రోగం తొలగిపోయేలా కొండంత భరోసా ఇచ్చి అస్మదీయుడయ్యాడు. మానవీయ వైద్యుడైన హనీమన్‌ను డాక్టర్స్ డే సందర్భంగా స్మరించుకుంటూ, తాను చేస్తున్న సేవలనూ వినమ్రంగా ప్రకటించుకుంటోంది ఆయన చూపిన మార్గంలో వైద్యం చేస్తున్న ‘పాజిటివ్ హోమియోపతి’. 

మనిషి మామూలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు జబ్బు ఎందుకులేదు? జబ్బు వచ్చినప్పుడే మనిషిలోని ఆరోగ్యానికి ఏమవుతుంది? ఆరోగ్యంగా ఉన్నప్పటి స్థితిని మనిషిలో పాదుకొల్పగలిగితే జబ్బు లేని స్థితికి అతడు వస్తాడు కదా! అలాంటప్పుడు ఏం చేయాలి? జబ్బు లేని స్థితిలో ఉన్నప్పుడు మనిషిలో ఉండే స్వాభావికమైన రోగనిరోధక శక్తినే పుంజుకునేలా చేయాలి. వెలుతురు వచ్చాక చీకటి జాడలు కనిపించనట్లుగా ఆరోగ్యం పుంజుకున్నాక జబ్బు జాడలే లేకుండా పోయేలా చేయగలిగితే?... ఇదీ హోమియోపతి వైద్యప్రక్రియలోని ఒక అంశం. దీని ఆధారంగానే మానవశరీరంలో తనకు తాను నయం చేసుకునే శక్తిని ప్రేరేపిస్తుంది హోమియో ప్రక్రియ. దాని ఆధారంగా మనిషి ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడు ఎలాంటి పూర్తి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉన్నాడో... తన కాన్‌స్టిట్యూషనల్ మందుల ద్వారా అదే శక్తిని మనిషిలో నింపుతుందది. దాంతో మనిషిలో రోగాన్ని ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది. ఫలితంగా ఆ జబ్బుతో పాటు అనుబంధంగా ఉన్న మరికొన్ని వ్యాధులు సైతం మనిషిలో లేకుండా సమూలంగా అంకురంతో సహా పెకలించివేస్తుంది ‘హోమియో’. ‘పాజిటివ్ హోమియోపతి’ సంస్థ కూడా ఇదే శాస్త్రీయతను పాటిస్తూ కాన్‌స్టిట్యూషనల్ పద్ధతిలో చికిత్సను అందిస్తోంది. 

ఈ తరహా వైద్యాన్ని ఆన్‌లైన్‌లో, ఫోన్‌ద్వారా, వ్యక్తిగతంగా నేరుగా రోగికి... ఇలా సాధ్యమైన అన్ని మార్గాల ద్వారా అందిస్తూ రోగులకు సేవచేస్తోంది. పాజిటివ్ హోమియోపతి సేవలు ఎంత విస్తృతం అంటే... బహుశా సగటున మన కుటుంబాలన్నింటిలోనూ గడపకు ఒకరైనా తప్పనిసరిగా మా గడప ఎక్కి మా సేవలందుకుని ఉంటారన్నది ‘పాజిటివ్ హోమియోపతి’ సంస్థ అంచనా. మా కాన్‌స్టిట్యూషనల్ సేవలకు సంతసించినందుకే రోగులు... ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల నుంచి ఎప్పట్నుంచో వస్తూ... ఇక్కడికి వచ్చి వైద్యచికిత్స తీసుకుని సంతోషంగా తిరిగి వెళ్తున్నారు. మా వద్దకు వచ్చే రోగులు ఒక పట్టాన లొంగకుండా దీర్ఘరోగాలుగా బాధించే డయాబెటిస్, అల్జైమర్స్, ఆటిజమ్, థైరాయిడ్ డిజార్డర్స్, అలర్జిక్ సమస్యలు, క్రానిక్ అండ్ అక్యూట్ బ్రాంకైటిస్, యాంగ్జైటీ న్యూరోసిస్, అలొపేషియా (పేనుకొరుకుడు, జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం వంటి సమస్యలు), స్థూలకాయం, ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, డర్మటైటిస్, గ్యాస్ట్రయిటిస్, ఆస్థమా, మైగ్రేన్, పక్షవాతం వంటి జబ్బుల విషయంలోనూ ఊరటపొందుతున్నారు. 

ఒక్క చికిత్స విషయంలోనే గాక... హోమియో వైద్యంలో జరిగే పరిశోధనల తర్వాత చోటుచేసుకునే శాస్త్రీయ అంశాలను అందరికీ చేరువచేస్తోంది పాజిటివ్ హోమియోపతి. ఈ సేవలన్నీ అందరికీ అందాలనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 40కిపైగా శాఖల్లో పూర్తిగా అర్హులైన 160కి పైగా క్వాలిఫైడ్ వైద్యులతో సంతృప్తికరమైన చికిత్స అందిస్తూ మంచి ఫలితాలను అందిస్తోంది. అందుకే ఇప్పుడు పాజిటివ్ హోమియోపతి అనే ఒక ముద్ర సమర్థమైన, ఉత్తమమైన, నమ్మకమైన వైద్యసేవలకు ప్రతీకగా మారి రోగులకు తిరుగులేని సేవలను అందిస్తోంది. 

పాజిటివ్ లైఫ్ సెన్సైస్ లిమిటెడ్ ప్రేరణతో ఏర్పాటైన పాజిటివ్ హోమియోపతి సంస్థ ఆవిర్భావం నాటి నుంచీ ప్రపంచవ్యాప్తంగా 78% మంది రోగులకూ, మనదేశంలో 65% మందికి, రాష్ట్రంలో 59%మందికి చికిత్సనందించింది. ఎదుగుదలలో క్రమక్రమాభివృద్ధిని నమోదు చేస్తూ, నేటి వరకు అన్ని ఆదాయవర్గాలకు సంతృప్తికరమైన సేవలను అందజేసింది, అందజేస్తోంది పాజిటివ్ హోమియోపతి. 

‘పాజిటివ్’ కారకుడు డాక్టర్ ఎ.ఎమ్.రెడ్డి

పాజిటివ్ హోమియోపతి క్రమానుగత అభివృద్ధికి కారణమైన వారు డాక్టర్ ఎ.ఎమ్.రెడ్డి. 1975లో జన్మించిన ఆయన పాజిటివ్ హోమియోపతి సంస్థను రూపొందించి 2005 నుంచి భారతదేశంలో హోమియోపతి వైద్యప్రక్రియ అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. ఆయన గుల్బర్గా యూనివర్సిటీ నుంచి హోమియోలో వైద్య పట్టాను తీసుకుని, మహారాష్ట్ర యూనివర్సిటీ నుంచి ఎండీ (హోమియో) పొందారు. తన సొంతజిల్లా కర్నూలులో దాదాపు 300కు పైగా పల్లెలను సందర్శించారు. భారతీయ పల్లె జనాలు అనుభవిస్తున్న రోగాలను గురించి స్వయంగా తెలుసుకోవడం కోసమే ఆ పర్యటనలు. అలా గ్రామీణులు అనుభవిస్తున్న రోగాలను అధ్యయనం చేశారు. ఎ.ఎమ్.రెడ్డి తండ్రిగారు స్వయానా రైతు కావడంతో... అన్ని వర్గాలకు అన్నాన్ని ఇచ్చే వారికి వారు ఎలాంటి రోగాలు-రొష్టులు లేకుండా ఉండాలన్న తనతండ్రిగారి సంకల్పం, ప్రోత్సాహం మేరకు హోమియో వైద్య చికిత్సా ప్రక్రియను స్వీకరించి కేవలం పదేళ్ల వ్యవధిలో భారతదేశంలో కేవలం ఒక వైద్యప్రముఖుడిగా మాత్రమే గాక రంగంలో సంస్థను నడిపే లీడర్‌గా పేరొందారు. స్వతహాగా సేవాదృక్పథం ఉండటంతో రాష్ట్రంలోని పలుచోట్లకు ముఖ్యంగా వైద్యసేవలు చేరడానికి ఒకింత కష్టమయ్యే గ్రామీణప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించారు. పిల్లలు మన భవిష్యత్ ఆశాదీపాలంటారు ఆయన. సంతానం లేని ఎందరికో పాజిటివ్ ఇన్‌ఫెర్టిలిటీ క్లినిక్‌ల ద్వారా ఆ దీపాలను తమ ఇళ్లలో వెలిగించుకునేలా వైద్యచికిత్స అందించారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి రాయితీలతో వైద్యసహాయం ఇచ్చారు.