Home ఆరోగ్యం వీర్యకణాలలో లోపాలు...చికిత్స


 
వీర్యకణాలలో లోపాలు...చికిత్స PDF Print E-mail
ఈరోజుల్లోనూ సంతానలేమిని ఒక పెద్ద సామాజిక సమస్యగా పరిగణిస్తున్నారు. స్త్రీ, పురుషులిద్దరిలో ఏ ఒక్కరిలో లోపం ఉన్నా అది సంతానలేమికి కారణమవుతుంది. పురుషుల్లో వీర్యకణాలలోపం వల్ల సంతానం కలగకపోవచ్చు. పురుషుల్లో వీర్యకణాలు లేకపోవడాన్ని అజూస్పెర్మియాగా పేర్కొంటారు. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ఆలిగోస్పెర్మియా అంటారు. సంతానం కలగడానికి ఒక మి.లీ. స్పెర్మ్‌లో 60 మిలియన్ నుంచి 120 మిలియన్ వీర్యకణాలు ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే సంతానం కలగడానికి అవరోధం కలుగుతుంది. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటే ఆ కౌంట్‌ను పెంచడానికి హోమియో మందుల ద్వారా సాధ్యమవుతుంది. 

పురుషుల్లో వీర్యకణాలు తగ్గడానికి కొన్ని కారణాలు 

క్రిప్టార్కిడిజమ్: బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు అతడి బీజాలు కడుపులో ఉంటాయి. ప్రసవం అయ్యాక అవి బీజకోశంలోకి వస్తాయి. ఏ కారణం వల్లనైనా బీజాలు బీజకోశంలోకి రాకపోవడాన్ని ‘క్రిప్టార్కిడిజమ్’ అంటారు. 

గవదబిళ్లలు: పిల్లల్లో గవదబిళ్లల ద్వారా బీజాలకు ఇన్ఫెక్షన్ సోకడం వల్ల యుక్తవయసుకు వచ్చాక అవి వీర్యకణాలను సరిగా ఉత్పత్తి చేయలేకపోవచ్చు. 

వేరికోసిల్: బీజాల్లో రక్తనాళాల వాపు రావడం (వేరికోసిల్) వల్ల వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోవచ్చు. 

ఏ కారణం వల్లనైనా బీజాలకు దెబ్బతగిలి అవి చిన్నవిగా మారడం వల్ల అవి వీర్యకణాలను ఉత్పత్తి చేయలేకపోవచ్చు. 

హార్మోన్‌ల లోపాలు: పురుషుల్లో హార్మోన్ల లోపాలు వీర్యకణాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. 

క్లెన్‌ఫెల్టర్ సిండ్రోమ్: పురుషుల్లో ఎక్స్, వై క్రోమోజోములు ఉంటాయి. కాని కొందరిలో రెండు ఎక్స్‌లు, ఒక వై క్రోమోజోమ్స్ ఉంటే దాన్ని క్లెన్‌ఫెల్టర్ సిండ్రోమ్ అంటారు. ఈ సిండ్రోమ్ ఉన్నవారిలో బీజాలు చిన్నగా ఉండి, యుక్తవయసులో రొమ్ములు పెరుగుతాయి. దీన్ని క్యారియోటైపింగ్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. 

వీర్యకణాల లోపాల నిర్ధారణ పరీక్షలు
సెమన్ అనాలిసిస్: వీర్యాన్ని పరీక్షించి, వీర్యకణాల సంఖ్యను తెలుసుకోవడం. 

డాప్లర్ స్టడీ స్క్రోటమ్: వేరికోసిల్ సమస్యను తెలుసుకోడానికి చేసే పరీక్ష. హార్మోన్ పరీక్ష టెస్టిక్యులార్ బయాప్సీ వంటి పరీక్షల ద్వారా పురుషుల్లో వీర్యకణాల లోపాలను తెలుసుకోవచ్చు. 

హోమియో చికిత్స: లైకోపోడియమ్, ఆసిడ్ ఫాస్, కలాడియమ్, కాలీకార్బ్, సెపియా, బరైటాసల్ఫ్ వంటి మందులతో పాటు అడ్వాన్స్‌డ్ జీనోమ్ థెరపీ ద్వారా... వ్యాధి మూలాలను గుర్తించి చికిత్స చేయడం వల్ల స్పెర్మ్‌కౌంట్‌ను మెరుగుపరచవచ్చు.