Home వ్యాధులు - నివారణ మానసిక సమస్యల వల్ల థైరాయిడ్ సమస్య తలెత్తవచ్చు


 
మానసిక సమస్యల వల్ల థైరాయిడ్ సమస్య తలెత్తవచ్చు PDF Print E-mail
థైరాయిడ్ గ్రంథిలో కొన్నిరకాల కారణాల వల్ల హైపో మరియు హైపర్ థైరాయిడిజమ్ వంటివి రావచ్చు. అంటే వారసత్వంగా కాని లేదా ఏదైనా మానసిక ఒత్తిడి, ఆందోళనల వలన, థైరాయిడ్ గ్రంథిలో ఉండే హార్మోన్ల ఉత్పత్తి సరిగ్గా ఉండదు. అంటే T3,T4 హార్మోన్లు ఎక్కువ లేదా తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవ్వటం జరుగుతుంది. ఒక్కొక్కసారి థైరాయిడ్ గ్రంథిలో చిన్నచిన్న కాయలు లాంటివి ఏర్పడి, అవి కాన్సర్‌లా కూడా మారవచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథిలో వచ్చిన లోపాల వల్ల, మానసిక, శారీరక ఎదుగుదల సమస్యలు తలెత్తడంతోపాటు, అవయవాల పనితీరు దెబ్బతినడం జరుగుతుంది. 

ఈ పైన చెప్పిన లక్షణాలు అన్ని కూడా థైరాయిడ్ గ్రంథిలో వచ్చే అసమతుల్యత వల్ల శరీరంలో ప్రతి ప్రక్రియ కూడా భాగం అవటం వల్ల ప్రతి అవయవంలోనూ విభేదం రావటం జరుగుతుంది.

అంతే కాకుండా ఆడవాళ్ళలో నెలసరి సమస్యలతో పాటు ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథిలో వచ్చిన లోపం వల్ల, మానసిక ఎదుగుదల మరియు మానసిక లోపాలు కూడా ఎక్కువగా గమనిస్తూ ఉంటాము.

హైపర్ థైరాయిడిజమ్ వల్ల వచ్చే మానసిక సమస్యలు
సాధారణంగా మానసిక ఒత్తిడి, ఆందోళనల వలన హైపర్ థైరాయిడిజమ్ రావచ్చు.
1) ఎక్కువగా ఆందోళన పడటం 
2) ప్రతి చిన్న విషయానికి భయపడటం 
3) ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారు. 
4) శబ్దాలను భరించలేరు. 
5) ఆత్మనూన్యతకు లోనవుతుంటారు.

ఈ థైరాయిడ్ గ్రంథి వల్ల వచ్చే మానసిక సమస్యలను చికిత్స లేకుండా విడిచిపెట్టేస్తే ‘థైరాయిడ్ క్రైసిస్’ లాంటివి రావచ్చు. అంటే మానసిక లక్షణాలు ఇంకా ఎక్కువ రావటం, జ్వరం లేదా తనలో తాను అదే పనిగా మాట్లాడుకోవటం వంటివి కనిపిస్తూంటాయి.

హైపర్ థైరాయిడిజమ్ లక్షణాలు
1) కంగారు పడటం 
2) చిరాకు 
3) చెమటలు ఎక్కువ పట్టడం
4) గుండెదడ 
5)చేతులు వణకడం 
6) ఆందోళన 
7)నిద్రలేమి 
8) చర్మం పొడిబారడం,
9) జుట్టు రాలడం
10) విరేచనాలు
11) బరువు తగ్గిపోవడం
12) వేడిని తట్టుకోలేక పోవటం
13) ఆకలి పెరగటం
14) యూరిన్ ఎక్కువసార్లు అవ్వటం 
15) నెలసరులు సరిగ్గా రాకపోవటం
16) కంటి చుట్టూ ఉండే కండరాలు బలహీనపడటం జరుగుతుంది.

హైపో థైరాయిడిజమ్ లక్షణాలు
థైరాయిడ్ హార్మోన్లు తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవ్వటం జరుగుతుంది.

ఆడవాళ్ళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

best-horoscope.com and Leo, fall in Aries. font-style: normal; font-variant: normal; font-weight: normal; letter-spacing: normal; line-height: 15px; text-align: start; text-indent: 0px; text-transform: none; white-space: normal; word-spacing: 0px; background-color: #ffffff; display: inline ! important; float: none">అతిగా బరువు పెరగటం, నెలసరి సమస్యల వల్ల చాలా త్వరితంగా ఈ పరిస్థితిని గుర్తించవచ్చు.

లక్షణాలు
1) అలసట 
2) ఆయాసం మరియు మానసికంగా ఆత్మనూన్యతకు లోనవటం 
3) చలిని తట్టుకోలేకపోవటం 
4) మలబద్దకం 5) జుట్టు మరియు చర్మం పొడిబారటం 
6) ఏకాగ్రత తగ్గిపోవటం
7) శరీరం అంతా నొప్పులు 
8) కాళ్ళు వాపులకు గురవటం
9) కంటి చుట్టూ వాపులు రావటం 
10) నెలసరులు సరిగ్గా రాకపోవటం అంటే అధిక రక్తస్రావం లేదా నెలసరులు పూర్తిగా రాకపోవటం
11) బరువు అకారణంగా పెరగటం.

హైపో థైరాయిడిజమ్ వల్ల వచ్చే మానసిక సమస్యలు:
1) మానసిక ఎదుగుదలలో లోపాలు 
2) ఆసక్తి తగ్గిపోవటం 
3) విషయాలు సరిగ్గా గుర్తుండక, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. 
4) ఆలోచనా శక్తి కూడా తగ్గిపోతుంది.

ముఖ్యంగా ఆత్మనూన్యత హైపోథైరాయిడిజమ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే శారీరకంగా కూడా అధిక బరువు వల్ల అందరిలాగా ప్రతి పనిలో పాల్గొనక పోవటం మరియు ఏకాగ్రత, ఆలోచనా శక్తి తగ్గిపోవటం వలన, చదువులో వెనకబడటం. జరుగుతుంది.దీనివలన నలుగురిలో కలవలేక వెనకబడటం జరుగుతుంది.

థైరాయిడ్ గ్రంథి అనేది శరీరంలో అతి పెద్దది. ఇది ముఖ్యంగా మెడ భాగంలో, థైరాయిడ్ కార్టిలేజ్ కింద ఉంటుంది. జీవ ప్రక్రియలు అన్నింటికి ఇది అతి ముఖ్యమైన గ్రంథి. శరీరంలో ఉండే అతి ముఖ్యమైన కొన్ని అవయవాలు కూడా థైరాయిడ్ గ్రంధి కంట్రోల్‌లో ఉంటాయి.

థైరాయిడ్ గ్రంథి ముఖ్యంగా 3 రకాలైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. 1)థైరాక్సిన్ (ఖీ3), 2) టైఐడో థైరోనిన్ (ఖీ4) , 3)కాల్సిటోనిన్. ఈ కాల్సిటోనిన్ శరీంలో సరైన మొత్తంలో కాల్షియంను ఉత్పత్తి అయ్యేలా చూస్తుంది.

ఏది ఏమైనా హైపో మరియు హైపర్ థైరాయిడిజమ్ మూలంగా మానసికంగా పేషెంట్లు ఎక్కువగా బాధపడటం వల్ల, థైరాయిడ్ లెవల్స్ మరీ ఎక్కువ లేదా తక్కువ అవటం జరుగుతుంది. పాజిటివ్ హోమియోపతిలో ఈ మానసిక సమస్యలకు అనుగుణంగా, పేషెంట్ తత్వాన్ని బట్టి, మూలకారణాన్ని ఎనలైజ్ చేసుకుని, ‘జెనిటిక్ కానిస్టిట్యూషనల్ సిమిలిమమ్’ అనే పద్ధతి ద్వారా మందులు ఇచ్చి పూర్తి స్థాయిలో పరిష్కారం ఇవ్వటం జరుగుతుంది.