Warning: session_start() [function.session-start]: Cannot send session cookie - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: session_start() [function.session-start]: Cannot send session cache limiter - headers already sent (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 423

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/content/76/6254476/html/WS19/VO19/index.php:4) in /home/content/76/6254476/html/WS19/VO19/libraries/joomla/session/session.php on line 426
Telugu Kathalu Vijayawada Online.. The First Vijayawada Information Portal. Tourism, Chat, Free Classifieds, Jobs, Chating, Radio, TV, Education, Games & more.... http://vijayawadaonline.com/kathalu.html Wed, 01 Dec 2021 22:33:21 +0000 Joomla! 1.5 - Open Source Content Management en-gb కొత్త కుందేలు http://vijayawadaonline.com/kathalu/776-kotta-kundelu.html http://vijayawadaonline.com/kathalu/776-kotta-kundelu.html ఒక అడవిలో ఒక కుందేలు, తాబేలు ఉండేవి. ఆ రెండింటికీ క్షణం సరిపడేది కాదు. కుందేలు వేగంగా గెంతుతూ వెళ్ళడం చూస్తే తాబేలుకు ఈర్ష్యగా వుండేది. అలాగే తాబేలు నెమ్మది నెమ్మదిగా నడవడం చూసి కుందేలుకు విచిత్రంగా వుండేది. ఒకరోజు కుందేలు తాబేలును పిలిచి ‘దూరంగా కనిపించే మర్రిచెట్టు వుంది చూశావూ! అక్కడికి మన ఇద్దరిలో ఎవరు ముందు వెళతారో పందెం వేసుకుందామా?’ అన్నది.

తాబేలు ఆలోచించింది. తాబేలుకు తాను చిన్నప్పుడు విన్న కథ గుర్తొచ్చింది. అప్పుడు ఒక కుందేలు ఇలాగే పందెం వేస్తే కుందేలు మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ వస్తుందనే విషయం తెలియని తాబేలు చకచకా వెళ్ళి పోయిందట. కాబట్టి తానేమీ కంగారుపడాల్సిన అవసరం లేదు అనుకున్నది. సరేనని పందానికి అంగీకరించింది తాబేలు.

మామూలు కంటే ఇంకా నెమ్మదిగా నడవటం ప్రారంభించింది తాబేలు. కుందేలు కూడా బాగా ఆలోచించింది, తాను చిన్నప్పుడు విన్న కుందేలు, తాబేలు కథ దానికి కూడా గుర్తొచ్చింది. అప్పట్లో కుందేలు తాబేలును తక్కువగా అనుకుని దాని చేతిలో ఓడిపోయింది.

కానీ కాలం మారింది. ఇప్పుడు ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయకూడదు అలాగే తన శక్తి గురించి ఎక్కువగా ఊహించుకోకూడదు. అన్నిటికీ మించి గమ్యం చేరే వరకూ ఎక్కడా విశ్రమించకూడదు అనుకున్న కుందేలు మరోదారిలో మామూలు కంటే వేగంగా పరుగెడుతూ ఎక్కడా ఆగకుండా గమ్యం చేరుకుంది. ఆనక విశ్రాంతిగా కూర్చుని తన వెంట తెచ్చుకున్న పండ్లు తీరిగ్గా తినసాగింది.

తర్వాత చాలాసేపటికి నెమ్మదిగా వచ్చిన తాబేలు అప్పటికే అక్కడికి చేరుకుని దర్జాగా కూర్చున్న కుందేలును చూసి ‘కాలం మారింది. నేనూ మారాలి’ అనుకుంది.]]>
Kids Stories Tue, 09 Jul 2013 20:42:47 +0000
నేల తల్లి http://vijayawadaonline.com/kathalu/775-nela-talli.html http://vijayawadaonline.com/kathalu/775-nela-talli.html నాగులాపురంలో రంగయ్య, రాజమ్మ అనే భార్యాభర్తలు ఉండేవాళ్లు. ఆ చిన్న పల్లెటూళ్లో వాళ్లకు పొలం, ఒక సొంత ఇల్లు ఉండేవి. పొలం సాగు చేసుకుంటూ సొంత ఇంట్లో హాయిగా ఉండేవాళ్లు.

కానీ రాజమ్మకు ఆ జీవితం రుచించలేదు. ఎంతసేపూ మట్టివాసన, పేడ కంపు తప్ప ఈ పల్లెటూళ్లో ఏముంది? హాయిగా పట్నం వెళ్లిపోతే చేతికి మట్టి తగలకుండా దర్జాగా బ్రతకవచ్చు అనుకునేది.

పట్నం వెళ్లిపోదామని రాజమ్మ రోజూ భర్తను పోరుపెట్టసాగింది. భార్య గొడవ భరించలేక పట్నం వెళ్లడానికి అంగీకరించాడు రంగయ్య.

కరణం ఇంటికి వెళ్లి తాను పొలం, ఇల్లు అమ్మేసి పట్నం వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. కరణం ఆశ్చర్యపోయాడు. బాగా ఆలోచించావా రంగయ్యా?’’ అని ప్రశ్నించాడు.
రంగయ్య సమాధానం చెప్పకుండా తలవంచుకుని నిలబడిపోయాడు. 

కరణం సరేనని పొలం, ఇల్లు తీసుకుని రంగయ్యకు కొంత డబ్బు ఇచ్చాడు. రంగయ్య, రాజమ్మ పట్నం చేరుకున్నారు. రంగయ్యకు వెతగ్గా వెతగ్గా ఒక చోట కార్యాలయం ఊడ్చే పని దొరికింది. చదువు రాని తనకు అంతకంటే ఇంకేం పని దొరుకుతుందిలే అనుకున్నాడు.

normal; casino online line-height: 15px; text-align: start; text-indent: 0px; text-transform: none; white-space: normal; word-spacing: 0px; background-color: #ffffff; display: inline ! important; float: none">ఇటు రాజమ్మ కూడా ఒక్క గదిలో ఇరుకు సంసారం, పాలు, పెరుగు, కూరగాయలు, సరుకులు, ఇంటి అద్దె అన్ని ఖర్చులూ మండిపోతున్నాయి అనుకున్నది. భర్త జీతం చాలడం లేదు.
ఆరు నెలలు గడిచేటప్పటికి రంగయ్య, రాజమ్మ చిక్కి శల్యమై పోయి కళ్లలో ప్రాణాలు పెట్టుకున్నారు. మళ్లీ పల్లెకు వెళ్లిపోదామంది రాజమ్మ, ‘‘అక్కడ మనకు ఏమున్నాయి ఇల్లా? పొలమా?’’ అన్నాడు రంగయ్య.

‘‘పుట్టి పెరిగిన ఊరు. ఎవరైనా జానెడు స్థలం ఇవ్వకపోతారా? చిన్న గుడిసె వేసుకుని ఉందాం. ఎవరి పొలంలోనైనా పని చేసుకుందాం’’ అంది రాజమ్మ. ఇద్దరూ పల్లెకు తిరిగివచ్చారు.
నేరుగా కరణం ఇంటికి వెళ్లాడు రంగయ్య. బావురుమని ఏడ్చేశాడు.

‘‘నాకు తెలుసు రంగయ్యా! అందుకే నీ పొలం, ఇల్లు అమ్మకుండా నా స్వాధీనంలోనే ఉంచేశాను. వెళ్లి నీ ఇంట్లో ఉండు. నీ పొలం మళ్లీ నువ్వే సాగు చేసుకో. నేలతల్లిని నమ్ముకున్నవాడు ఎవరూ చెడిపోడు’’ అన్నాడు కరణం.

రంగయ్య పొలానికి వెళ్ళాడు. పొలాన్ని చూడగానే తప్పిపోయిన పిల్లవాడు తిరిగి తల్లి ఒడికి చేరినంత సంబరం కలిగింది రంగయ్యకు ‘‘నా తల్లి! నా నేలతల్లి!’’ అనుకున్నాడు.]]>
Kids Stories Tue, 09 Jul 2013 20:41:53 +0000
వాగ్దానం - వాస్తవం http://vijayawadaonline.com/kathalu/772-vagdanam-vastavam.html http://vijayawadaonline.com/kathalu/772-vagdanam-vastavam.html గౌరీపురంలో హేమంతుడు అనే ధనికుడు ఉండేవాడు. అతనికి పెద్ద భవంతి, డబ్బు, బంగారం, వస్తువులు, వాహనాలు లెక్కలేనన్ని ఉండేవి. అయితే దానధర్మాల విషయంలో మాత్రం అతను పరమ పిసినారి. ఎవరైనా ఏదైనా సహాయం అడగటానికి వస్తే ఏవో సాకులు చెప్పి తర్వాత రమ్మనేవాడు. తర్వాత వెళితే మళ్లీ ఇంకేదో కారణం చెప్పేవాడు. అంతేగానీ పైసా కూడా ఇచ్చేవాడు కాదు. ఆ విధంగా హేమంతుడికి ఊర్లో చెడ్డపేరు వచ్చింది.

అదే ఊరిలో ప్రసన్నుడు అనే మరొక వ్యక్తి ఉండేవాడు. అతడు ధనవంతుడు కాకపోయినా ఉన్నంతలో ఇతరులకు తనకు తోచిన సాయం చేస్తుండేవాడు. అడిగినవారికి లేదనకుండా తృణమోపణమో ఇస్తుండటంతో ప్రసన్నుడిని అందరూ మెచ్చుకునేవారు. ఇదిచూసి హేమంతుడికి ఈర్ష్య కలిగింది. హేమంతుడు ఒక ఉపాయం ఆలోచించాడు. ‘‘కొంతకాలం ఆగండి. నేను నా ఆస్తి మొత్తాన్నీ ఈ ఊళ్లో బడి, గుడి కట్టించడానికి, దానధర్మాలకు ఇచ్చేస్తాను’’ అని అందరినీ పిలిచి చెప్పడం ప్రారంభించాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు.

ప్రసన్నుడు మాత్రం ఎప్పటిలాగానే అందరికీ సాయం చేస్తూ బడికి వెళ్లే పేదపిల్లలకు పలకలు, బలపాలు ఉచితంగా ఇవ్వసాగాడు. అలాగే గుడికివెళ్లే భక్తులకు ఉచితంగా ప్రసాదాలు పంచిపెట్టసాగాడు. ఒకరోజు ప్రసన్నుడికి ఊర్లో ఘనసన్మానం జరిగింది. ‘‘నా ఆస్తిని బడికి, గుడికి ఇస్తానంటే నాకు గాక ఇతనికి సన్మానం చేస్తారా?’’ అని హేమంతుడు అందరినీ అడిగాడు. ‘‘మీరు ఎప్పుడో ఇస్తానంటున్నారు. ఆయన ఇప్పుడే ఇస్తున్నారు. అదీ తేడా’’ అన్నారు ప్రజలు. దాంతో తన తప్పు తెలుసుకుని అప్పటి నుంచి ఉదారంగా ఉండ సాగాడు ప్రసన్నుడు.]]>
Kids Stories Tue, 09 Jul 2013 19:16:37 +0000
సరైన చికిత్స http://vijayawadaonline.com/kathalu/771-sarina-chikitsa.html http://vijayawadaonline.com/kathalu/771-sarina-chikitsa.html వేదపురి గ్రామంలో పంటలు విరివిగా పండేవి. అదీ ఇదీ అని లేకుండా వరి మొదలు అరటి వరకూ అన్ని రకాల పంటలకూ, తోటలకూ వేదపురి గ్రామం నిలయంగా వుండేది.
పంటలు పుష్కలంగా పండటంతో ఆ ఊరి ప్రజలంతా తమకు కావల్సినంత ఉపయోగించుకుని, మిగిలింది అమ్ముకుని సుఖ సంతోషాలతో తులతూగుతుండేవారు.

అయితే కాలం ఎప్పుడూ ఒకేలాగ వుండదు. హఠాత్తుగా ఎలా వచ్చిందో ఏమో పంటలకు విపరీతంగా చీడ వచ్చింది. అదీ ఇదీ అని లేకుండా అన్నిరకాల పంటలకూ, తోటలకూ చీడ సోకి పాడై పోవడం మొదలయ్యింది. గ్రామస్థులకు ఏమి చేయాలో తోచలేదు.

ఒకరోజు ఒక సాధువు వచ్చి ‘‘మీ ఊరిలో పాపం పెరిగి పోయింది, అందువల్లనే పంటలకు ఇలా అయింది. నేను దీనికి శాంతి చేయిస్తాను’’ అంటూ ఒక్కొక్కరి దగ్గర వందరూపాయలు తీసుకుని తెల్లారేసరికి పారిపోయాడు.

కొన్నాళ్ల తర్వాత ఒక మంత్రగాడు వచ్చి ‘‘మీ ఊరిలో దుష్టశక్తులు సంచరిస్తున్నాయి. వాటిని తరిమేయాలంటే నాకు కొంత బంగారం ఇవ్వాలి’’ అని బంగారం తీసుకుని మాయమైపోయాడు.

అటు తర్వాత ఒక జ్యోతిష్యుడు వచ్చి ‘‘మీ ఊరికి శని పట్టింది. శనిని వదిలించాలంటే ఇంటింటినుంచీ నాకు నేను చెప్పిన కానుకలు ఇవ్వాలి’’ అని చెప్పి అవన్నీ మూట గట్టుకుని రాత్రికి రాత్రే జారుకున్నాడు.

ఆ తర్వాత ఒక యువకుడు వచ్చి ‘‘మీ ఊళ్లో పంటలకు తెగులు సోకింది. క్రిమిసంహారక మందులు చల్లితే చాలు’’ అని మందులు తెప్పించి చల్లడంతో తెగులు నశించి పంటలు బాగుపడ్డాయి. ]]>
Kids Stories Tue, 09 Jul 2013 19:15:35 +0000
పుణ్యంలో సగం http://vijayawadaonline.com/kathalu/770-punyam-lo-sagam.html http://vijayawadaonline.com/kathalu/770-punyam-lo-sagam.html సోమయ్య అనే వ్యక్తి ఎంతో మంచివాడు. తనకు చేతనైనంతలో ఇతరులకు సాయం చేయాలనే మనస్తత్వం కలవాడు. అయితే అతని ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమే.

పేదరికం అతనిని పట్టి పీడిస్తోంది. దీనికి తోడు ఒక పెద్ద కుటుంబాన్ని పోషించుకోవలసిన బాధ్యత అతని మీద వుంది.

అందువల్ల సోమయ్య ఇతరులకు డబ్బు సాయం చేయలేకపోయినా మాటసాయం మాత్రం చేస్తుండేవాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా గభాలున వెళ్ళి ఆదుకుని చేయగలిగిన పని చేసి వస్తుండేవాడు.

ఒకరోజు సోమయ్య వాకిట్లో అరుగుమీద కూర్చుని తాళ్లు పేనుకుంటూ వుండగా ఒక వ్యక్తి వచ్చాడు. అతను తన పేరు వీరయ్య అనీ భార్యాపిల్లలతో కలిసి అరణ్యమార్గంపై వస్తుండగా దొంగలు వచ్చి తమ దగ్గర వున్న డబ్బు, బట్టలతో సహా అంతా దోచుకుపోయారని భోరున విలపిస్తూ చెప్పాడు. భార్యా బిడ్డలను ఆలయం దగ్గర కూర్చోబెట్టి తాను సాయం కోసం వచ్చానన్నాడు.

సోమయ్య అతని పరిస్థితికి జాలిపడ్డాడు. కానీ తనదగ్గర ఏమీ లేకపోవడంతో ఒక ఆలోచన చేశాడు. ‘‘చూడు వీరయ్యా! నేను నీకు ఏమీ ఇవ్వలేను. కానీ ఇక్కడికి సమీపంలో దానయ్య అని ఒక ధనవంతుడు వున్నాడు. అతనిని అడుగు నీకు ఏమైనా ఇస్తాడు’’ అని దానయ్య ఇంటికి వెళ్లే దారి వివరంగా చెప్పాడు.

వీరయ్య వెళ్లి అడుగ్గానే దానయ్య కొంత డబ్బు, బట్టలు, భోజనపదార్థాలు ఇచ్చాడు. 
కొన్నాళ్లకు దానయ్య, సోమయ్య చనిపోయారు. దేవదూతలు వచ్చి దానయ్యను స్వర్గానికి తీసుకువెళ్లారు. తనతోపాటూ సోమయ్య కూడా వుండటం చూసి దానయ్య ఆశ్చర్యపోగా ‘‘నువ్వు దానం చేసి పుణ్యం సంపాదించావు. దానం చేసే నిన్ను గురించి చెప్పి నీ పుణ్యంలో కొంతభాగం సోమయ్య కూడా సంపాదించాడు’’ అని దేవదూతలు చెప్పారు.]]>
Kids Stories Tue, 09 Jul 2013 19:14:07 +0000
ప్రత్యుపకారం http://vijayawadaonline.com/kathalu/381-2012-07-07-17-57-02.html http://vijayawadaonline.com/kathalu/381-2012-07-07-17-57-02.html

ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఒకరోజు అది తన గుహలో నిద్రిస్తుండగా హఠాత్తుగా ఒక ఎలుక దాని మీద పడింది. ఉలిక్కి పడి లేచి ఎలుకను పట్టుకుంది సింహం. ఆహారం కోసం ఆ గుహలో వెతుకుతూ గోడపై నుండి వెళుతూ పట్టు తప్పి సింహంపై పడింది ఆ ఎలుక. సింహం ఎలుకను చంపబోతుంటే తనను చంపొద్దని బతిమాలింది. ముందు ముందు తను సింహానికి ఏదైనా ఉపకారం చేస్తానని ఎలుక చెప్పడంతో సింహం ఎలుకను వదిలేసింది.

కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు అడవికి సర్కస్ వాళ్లు వచ్చారు. సింహాన్ని బంధించి బోనులో పెట్టారు. అడవిలో దారి బాగులేకపోవడం వలన వాహనాన్ని దారి బాగున్న చోటనే నిలిపారు. అటుగా వెళ్తున్న ఎలుక ఆ వాహనాన్ని చూసింది. ‘ఇక్కడది ఎందుకుందబ్బా!’ అని ఆలోచిస్తుండగానే ఒక బోనును మోసుకొస్తున్న నలుగురు వ్యక్తులు కనిపించారు. బోనులో చూస్తే సింహం ఉంది. సింహాన్ని పట్టుకెళ్తున్నారని అర్థమైంది ఎలుకకు.

సింహాన్ని ఎలా కాపాడాలా? అని ఆలోచించింది ఎలుక. దానికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఆ వాహనానికి ఉన్న నాలుగు చక్రాలను కొరికింది. దీంతో వాటిలోని గాలి పోయి, వాహనం ముందుకు కదలలేదు. దాంతో ఆ సర్కస్ వాళ్లకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చీకటిపడితే తాము క్రూరజంతువులకు ఆహారం కావలసి వస్తుందన్నాడు ఒకడు.

దీంతో వారు భయపడి బోనులోని సింహాన్ని విడిచిపెట్టి, వాహనాన్ని కూడా అడవిలోనే వదిలేసి వెళ్లిపోయారు. వారు వెళ్లాక ఎలుక సింహం దగ్గరకు వెళ్లి ‘‘మిత్రమా! ఇది నీ జీవన్మరణ సమస్య. నువ్వు నీ పూర్తి బలాన్ని ఉపయోగించి ఈ బోనుని బద్దలుకొట్టి బయటకురా’’ అని ప్రోత్సహించింది. అలానే చేసి బోనుని బద్దలుకొట్టి బయటకు వచ్చింది ఆ సింహం. అప్పటి నుండి ఎలుక, సింహం మంచి మిత్రులయ్యాయి.

]]>
Kids Stories Sat, 07 Jul 2012 17:53:44 +0000
కోరిక http://vijayawadaonline.com/kathalu/380-korika.html http://vijayawadaonline.com/kathalu/380-korika.html

ఒక అడవిలో ఒక గుర్రం ఉండేది. అది తెల్లగా, అందంగా ఉండేది. ఆ అడవిలోని గుర్రాలన్నింటి కన్నా అదే వేగంగా పరిగెత్తేది. కానీ అది అసంతృప్తిగా ఉండే ది. ఒకసారి ఒక ముని ఆ అడవిలో నుండి వెళ్తున్నాడు. అతడు చాలా మహిమ గలవాడు. వరాలను ప్రసాదించే శక్తి కూడా అతనికి ఉంది.

అడవిలో తిరుగుతున్న గుర్రం ఆ మునిని చూసి, ‘‘నమస్సుమాంజలులు మునివర్యా!’’ అని దండం పెట్టింది. ఆ ముని గుర్రాన్ని ఆశీర్వదించాడు. ఏమైనా వరం కావాలంటే కోరుకొమ్మన్నాడు. అప్పుడు ఆ గుర్రం ‘‘స్వామీ! నాకు మరింత అందం కావాలనుంది. నన్ను ఇంకా తెల్లగా చేయండి. అలానే ఇంకా వేగంగా పరిగెత్తేందుకు అనువుగా నా కాళ్లను మార్చండి. ఇంకా నేను చాలా బలవంతుడినయ్యేట్టు చేయండి’’ అని వరం అడిగింది. ‘‘తథాస్త్తు’’ అన్నాడు మహిమ గల ఆ ముని. వెంటనే గుర్రం మారిపోయింది. అది ముట్టుకుంటే మాసిపోయేంత తెల్లగా అయ్యింది. చిన్న మరక కూడా కొట్టొచ్చినట్టు కనిపించేలా ఉంది.

వేగంగా పరిగెత్తేందుకు అనువుగా మారిన దాని కాళ్లు చూడడానికి విచిత్రంగా ఉన్నాయి. బలవంతుడిలా మారిన ఆ గుర్రం పెద్ద పెద్ద కండలతో వికృతంగా కనిపిస్తోంది. మారిన తన శరీరం తనకే అసహ్యంగా అనిపించింది ఆ గుర్రానికి. వెంటనే తనను పూర్వపుస్థితికి తీసుకురమ్మని మునిని వేడుకొంది గుర్రం. ముని ఆ గుర్రానికి పూర్వపుస్థితిని తెచ్చాడు. ‘‘భగవంతుడు ఏ జీవి ఎలా ఉంటే మంచిదో అలా తయారు చేశాడు. కాబట్టి మనం వేరే లక్షణాలు కావాలని కోరుకోవడం తప్పు’’ అని చెప్పి అక్కడి నుండి కదిలాడు ఆ మునిపుంగవుడు.

]]>
Kids Stories Sat, 07 Jul 2012 17:34:36 +0000
నిజమైన రాజకుమారుడు http://vijayawadaonline.com/kathalu/325-2012-05-28-21-16-10.html http://vijayawadaonline.com/kathalu/325-2012-05-28-21-16-10.html

ఒక రాజ దంపతులకి లేక లేక కుమార్తె పుట్టింది. రాజు ఆనందంతో సంబరాలు జరిపించాడు. ఆ పాపకు పేరు పెట్టే సమయంలో కొంతమంది దేవతలు కూడా వచ్చారు. అకస్మాత్తుగా ఒక ముసలి స్త్రీ వచ్చి, ‘‘అందరికంటే పెద్దదాన్నైన నన్ను ఆహ్వానించలేదు. మీకెంత ధైర్యం? ఇందుకు శిక్షగా మీ పాపకి శాపం ఇస్తున్నాను - ఆమె ఇరవైయ్యేళ్ల వయసులో చనిపోతుంది’’ అని శపించి, వెళ్లిపోయింది.

రాజు, రాణి దిగులుతో కూలబడిపోయారు. వారి స్థితి చూసి, జాలిపడి, దేవతలు ‘‘రాజా, బాధపడకు. ఆమె శాపం ఉపసంహరించలేము గానీ, తగ్గించగలము. ఇరవైయ్యేళ్లు వచ్చాక యువరాణి చనిపోకుండా గాఢ నిద్రలోకి వెళ్తుంది. ఎవరైన యువరాజు వచ్చి ఆమెను తాకితే ఆమె మేలుకుంటుంది. ఇక ఏ సమస్యా ఉండదు’’ అన్నారు.

రాజు కాస్త ఊరట చెందాడు.
క్రమ క్రమంగా రాజుగారి కుమార్తె అందమైన యువరాణిగా పెరిగింది. సరిగ్గా ఆమె 20వ పుట్టిన రోజునాడు కళ్లు తిరిగి పడిపోయి, అలాగే గాఢ నిద్రలోకి వెళ్లిపోయింది.
అప్పటినుండి రాజు ఎంతో జాగ్రత్తగా ఆమెను కాపాడుతూ ఉన్నాడు.

ఒకరోజు రాజభటులు ఒక యువకుడిని సభలోకి తీసుకువచ్చారు. విచారించగా, అతను ఒక యువరాజని తెలిసింది. ‘‘నేను కోసల దేశపు యువరాజుని, వేటాడుతూ వేటాడుతూ దారి తప్పి మీ రాజ్య పొలిమేర ల్లోకి వచ్చాను. దుస్తులు దుమ్ముతో ఉండటం వలన నన్ను మీవాళ్లు గుర్తు పట్టలేదు’’ అన్నాడు ఆ యువకుడు. రాజుగారికి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. అతను నిజమైన యువరాజో కాదో తెలుసుకోవడానికి ఒక ఉపాయం చేద్దామనుకున్నాడు.
అతన్ని, నిద్రపోతున్న యువరాణి ఉన్న మందిరానికి తీసుకెళ్లి, ‘‘యువరాణిని నిద్రలేపగలవా?’’ అని అడిగాడు.

యువకుడు వెళ్లి యువరాణి నుదురు ముట్టుకోగానే ఆమె నిద్ర నుండి మేలుకుంది.
రాజు ఆనందంతో యువకుణ్ని దగ్గరకు తీసుకున్నాడు. అతను నిజమైన యువరాజే అని నిశ్చయమైపోయింది. అతని తల్లిదండ్రులతో మాట్లాడి, తన కుమార్తెను అతనికిచ్చి వివాహం జరిపించాడు.

]]>
Kids Stories Mon, 28 May 2012 21:13:40 +0000
Ikamatyam - ఐక్యమత్యం http://vijayawadaonline.com/kathalu/317-ikamatyam.html http://vijayawadaonline.com/kathalu/317-ikamatyam.html ]]> Kids Stories Mon, 28 May 2012 20:41:06 +0000 Kunti Gurram - కుంటిగుర్రం http://vijayawadaonline.com/kathalu/316-kunti-gurram.html http://vijayawadaonline.com/kathalu/316-kunti-gurram.html ]]> Kids Stories Mon, 28 May 2012 20:38:01 +0000