Home చిట్టి కథలు నేల తల్లి


 
నేల తల్లి PDF Print E-mail
నాగులాపురంలో రంగయ్య, రాజమ్మ అనే భార్యాభర్తలు ఉండేవాళ్లు. ఆ చిన్న పల్లెటూళ్లో వాళ్లకు పొలం, ఒక సొంత ఇల్లు ఉండేవి. పొలం సాగు చేసుకుంటూ సొంత ఇంట్లో హాయిగా ఉండేవాళ్లు.

కానీ రాజమ్మకు ఆ జీవితం రుచించలేదు. ఎంతసేపూ మట్టివాసన, పేడ కంపు తప్ప ఈ పల్లెటూళ్లో ఏముంది? హాయిగా పట్నం వెళ్లిపోతే చేతికి మట్టి తగలకుండా దర్జాగా బ్రతకవచ్చు అనుకునేది.

పట్నం వెళ్లిపోదామని రాజమ్మ రోజూ భర్తను పోరుపెట్టసాగింది. భార్య గొడవ భరించలేక పట్నం వెళ్లడానికి అంగీకరించాడు రంగయ్య.

కరణం ఇంటికి వెళ్లి తాను పొలం, ఇల్లు అమ్మేసి పట్నం వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. కరణం ఆశ్చర్యపోయాడు. బాగా ఆలోచించావా రంగయ్యా?’’ అని ప్రశ్నించాడు.
రంగయ్య సమాధానం చెప్పకుండా తలవంచుకుని నిలబడిపోయాడు. 

కరణం సరేనని పొలం, ఇల్లు తీసుకుని రంగయ్యకు కొంత డబ్బు ఇచ్చాడు. రంగయ్య, రాజమ్మ పట్నం చేరుకున్నారు. రంగయ్యకు వెతగ్గా వెతగ్గా ఒక చోట కార్యాలయం ఊడ్చే పని దొరికింది. చదువు రాని తనకు అంతకంటే ఇంకేం పని దొరుకుతుందిలే అనుకున్నాడు.

normal; casino online line-height: 15px; text-align: start; text-indent: 0px; text-transform: none; white-space: normal; word-spacing: 0px; background-color: #ffffff; display: inline ! important; float: none">ఇటు రాజమ్మ కూడా ఒక్క గదిలో ఇరుకు సంసారం, పాలు, పెరుగు, కూరగాయలు, సరుకులు, ఇంటి అద్దె అన్ని ఖర్చులూ మండిపోతున్నాయి అనుకున్నది. భర్త జీతం చాలడం లేదు.
ఆరు నెలలు గడిచేటప్పటికి రంగయ్య, రాజమ్మ చిక్కి శల్యమై పోయి కళ్లలో ప్రాణాలు పెట్టుకున్నారు. మళ్లీ పల్లెకు వెళ్లిపోదామంది రాజమ్మ, ‘‘అక్కడ మనకు ఏమున్నాయి ఇల్లా? పొలమా?’’ అన్నాడు రంగయ్య.

‘‘పుట్టి పెరిగిన ఊరు. ఎవరైనా జానెడు స్థలం ఇవ్వకపోతారా? చిన్న గుడిసె వేసుకుని ఉందాం. ఎవరి పొలంలోనైనా పని చేసుకుందాం’’ అంది రాజమ్మ. ఇద్దరూ పల్లెకు తిరిగివచ్చారు.
నేరుగా కరణం ఇంటికి వెళ్లాడు రంగయ్య. బావురుమని ఏడ్చేశాడు.

‘‘నాకు తెలుసు రంగయ్యా! అందుకే నీ పొలం, ఇల్లు అమ్మకుండా నా స్వాధీనంలోనే ఉంచేశాను. వెళ్లి నీ ఇంట్లో ఉండు. నీ పొలం మళ్లీ నువ్వే సాగు చేసుకో. నేలతల్లిని నమ్ముకున్నవాడు ఎవరూ చెడిపోడు’’ అన్నాడు కరణం.

రంగయ్య పొలానికి వెళ్ళాడు. పొలాన్ని చూడగానే తప్పిపోయిన పిల్లవాడు తిరిగి తల్లి ఒడికి చేరినంత సంబరం కలిగింది రంగయ్యకు ‘‘నా తల్లి! నా నేలతల్లి!’’ అనుకున్నాడు.