Home Tech గూగుల్ నెక్సస్ 7


 
గూగుల్ నెక్సస్ 7 PDF Print E-mail

కంప్యూటర్ ప్రపంచంలో గూగుల్‌కు ఓ ప్రత్యేక స్థానముంది.
సెర్చింజన్‌గా మాత్రమే కాకుండా... ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనూ వినియోగదారులపై తనదైన ముద్ర వేసుకున్న ఘనత ఈ కంపెనీ సొంతం. అటువంటి సంస్థ నెక్సస్ 7తో తాజాగా టాబ్లెట్ పీసీ రంగంలో కాలుపెట్టింది.

దీంతో సహజంగానే ఈ టాబ్లెట్ ప్రత్యేకతలేమిటి? ఫీచర్లు ఏమిటన్న అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది.



గూగుల్ నెక్సస్ 7 టాబ్లెట్ గురించి మొట్టమొదట చెప్పుకోవాల్సింది దాని ధర. ఐప్యాడ్, శాంసంగ్ గెలాక్సీ వంటి టాబ్లెట్లు రూ.30 వేల పైచిలుకు ధర పలుకుతూంటే నెక్సస్ మాత్రం కేవలం రూ.11 వేలకే మీ సొంతం అవుతుంది. ఎనిమిది గిగాబైట్ల స్టోరేజీ సామర్థ్యమున్న నెక్సస్ 7 టాబ్లెట్‌ను 199 అమెరికన్ డాలర్లకు విక్రయిస్తామని గూగుల్ ఈ మధ్యనే ప్రకటించింది.

ప్రాసెసర్: క్వాడ్‌కోర్ ఎన్‌విడియా టెగ్రా 3 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అంటే టాబ్లెట్ల రంగంలో అతిశక్తిమంతమైన మైక్రోప్రాసెసర్. ఇది 1.3 గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు ఈ టాబ్లెట్‌లో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ కోసం మొత్తం 12 కోర్‌లు ఉన్న జీపీయూను ఉపయోగించారు. టెగ్రా 3 మైక్రోప్రాసెసర్‌కు సంబంధించిన పని మొత్తం హైదరాబాద్‌లోని ఎన్‌విడయా కేంద్రంలోనే జరగడం మరో విశేషం.

మెమరీ: ముందుగా చెప్పుకున్నట్లు నెక్సస్ 7 ఎనిమిది గిగాబైట్ల మెమరీతో లభ్యమవుతుంది. ఇది బేసిక్ వెర్షన్‌కాగా 16 జీబీ మెమరీతో మరో వెర్షన్‌ను కూడా గూగుల్ అందుబాటులోకి తేనుంది. కొంచెం చిత్రమైన అంశం ఏమిటంటే నెక్సస్ 7లో మైక్రో ఎస్‌డీ స్లాట్ లేకపోవడం. అంటే... మెమరీని మన అవసరాలకు తగ్గట్టుగా పెంచుకునే సౌకర్యం లేదన్నమాట. చాలా టాబ్లెట్లు 32 జీబీ వరకూ మెమరీని ఆఫర్ చేస్తూండటం గమనార్హం. అయితే నెక్సస్ 7 క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫార్మ్‌పై పనిచేసే అవకాశముంది కాబట్టి ఎక్కువ మెమరీ ఇవ్వలేదని కొన్ని వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

బ్యాటరీ: నెక్సస్ 7ను తొమ్మిదిగంటలపాటు ఏకధాటిగా ఉపయోగించుకోవచ్చు. అది కూడా వీడియోలు లేదా గేమింగ్‌తో నడిపించవచ్చు. దీంట్లోని బ్యాటరీతో పదిగంటలపాటు ఈ-రీడింగ్, 300 గంటలు స్టాండ్‌బైగా ఉపయోగించుకోవచ్చు.

గూగుల్ ప్లే అప్లికేషన్లు: నెక్సస్ 7కు ఉన్న మరో అదనపు ప్రయోజనం ఆండ్రాయిడ్ మార్కెట్‌లోని దాదాపు ఆరు లక్షల అప్లికేషన్లు/గేమ్స్ అందుబాటులో ఉండటం. గూగుల్ ప్లే పేరుతో ఆండ్రాయిడ్ అప్లికేషన్లు అన్నింటినీ గూగుల్ ఒక దగ్గరకు చేర్చిన విషయం తెలిసిందే. రకరకాల మ్యాగజైన్లు, ఈ-బుక్స్, సినిమాలు, పాటలు కూడా అందుబాటులో ఉంటాయి. గూగుల్ అప్లికేషన్ల సంగతి సరేసరి. వెబ్‌బ్రౌజర్ క్రోమ్, గూగుల్ ప్లస్‌తో సోషల్ నెట్‌వర్కింగ్, మెయిళ్ల కోసం జీమెయిల్, మ్యాపులు రెడీగా ఉంటాయన్నమాట.

 
 
We have 207 guests online