Home Tech ట్విటర్


 
ట్విటర్ PDF Print E-mail
సెలబ్రిటీ వార్తలకు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు బ్రేకింగ్ పాయింట్ ట్విటర్. అరబ్ విప్లవాలైనా, అమెరికా ఎన్నికలైనా, మనదేశంలో జరుగుతున్న అవినీతి వ్యతిరేక ఉద్యమాలైనా.... దేశ దేశాల్లో జరుగుతున్న ప్రతి విషయమూ ట్విటర్‌లో చర్చనీయాంశమే. అలాంటి ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటి? విశ్వవ్యాప్తంగా ఇప్పుడు ట్రెండీ టాపిక్స్ ఏంటి అనే విషయం గురించి వివరిస్తుంటుంది ఎలెక్షనిస్టా.కామ్ వంద దేశాల పరిధిలోని ట్విటర్ అకౌంట్‌లలో జరుగుతున్న చర్చలను, చర్చల్లో నలుగుతున్న అంశాల గురించి వచ్చే మంచి మంచి ట్వీట్స్‌ను అందుబాటులో ఉంచుతుంది ఈ వెబ్‌సైట్. ఇక్కడ టాపిక్ పేరును టైప్ చేసి అందుకు సంబంధించిన ట్వీట్స్ సెర్చ్ చేసుకోవచ్చు. నచ్చిన వాటికి రీట్వీట్ కూడా ఇవ్వొచ్చు. ట్విటర్ సైట్ ద్వారా ఇలాంటి అవకాశం ఉన్నప్పటికీ, టాపిక్ ను బట్టి మంచి మంచి ట్వీట్స్‌ను కూర్చి మన పనిని సులభతరం చేస్తుంది ఈ వెబ్‌సైట్. ఈ ట్విటర్ ట్రెండ్స్‌ను సులభంగా పట్టేయడానికి క్లిక్ చేయండి...
 
 
We have 179 guests online