Home Vidhya - విద్య Banking బ్యాంకింగ్


 
Banking బ్యాంకింగ్ PDF Print E-mail
ప్రతిభకు పెద్దపీట వేసే రంగాల్లో బ్యాంకింగ్ ఒకటి. ఇందులో ప్రవేశించిన వారు సామర్థ్యం, అనుభవం ఆధారంగా అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చు. ఇంటర్ అర్హతతోనే బ్యాంక్‌ల్లో క్లర్క్ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. డిగ్రీతో పీఓగా కెరీర్ ప్రారంభించొచ్చు. క్లర్క్, పీఓ ఏ హోదాలో చేరినప్పటికీ డిపార్ట్‌మెంటల్ పరీక్షల ద్వారా ఉన్నత స్థానానికి చేరుకోవడం సులువే. తాజాగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులన్నీ ఐబీపీఎస్ నిర్వహించే కామన్ పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టడం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం.

కామన్ రిటెన్ ఎగ్జామినేషన్
ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సర్వీసెస్ (ఐబీపీఎస్) జాతీయ స్థాయిలో కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తోంది. ఏటా రెండుసార్లు పీఓ/మేనేజ్‌మెంట్ ట్రైనీస్, క్లరికల్ కేడర్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్‌కు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మూడు పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. ఈ స్కోర్‌కు ఏడాది వ్యాలిడిటీ ఉంటుంది. దీని ఆధారంగా ఆ సమయంలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసే బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కోర్ పెంచుకోవాలనుకుంటే మాత్రం ఆరు నెలల తర్వాత మరోసారి ఈ పరీక్షకు హాజరుకావొచ్చు. ఐబీపీఎస్ నిర్వహించే ప్రవేశ పరీక్షలో విజయం సాధించడానికి ఇంగ్లిష్, మ్యాథ్స్, రీజనింగ్‌లలో నైపుణ్యం కీలకం. క్లరికల్, ఆఫీసర్ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలో దాదాపుగా సబ్జెక్టులు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ప్రశ్నపత్రం క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది.

పీఓస్/మేనేజ్‌మెంట్ ట్రైనీ పరీక్ష విధానం:
ఐబీపీఎస్ నిర్వహించే పీఓస్ కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ మొత్తం ఐదు సెక్షన్లుగా రెండున్నర గంటల వ్యవధిలో ఉంటుంది.
సెక్షన్ పశ్నలు మార్కులు
రీజనింగ్ 50 50
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 25
క్వాంటిటేటివ్
ఆప్టిట్యూడ్ 50 50
జనరల్ అవేర్‌నెస్ 50 50
కంప్యూటర్ నాలెడ్జ్ 50 50

వివరాలు..
60 నిమిషాల వ్యవధిలో 25 మార్కులకు ఇంగ్లిష్ కాంపోజిషన్‌పై డిస్క్రిప్టివ్ పరీక్ష కూడా ఉంటుంది. ఎస్సే రైటింగ్, ప్రెసి రైటింగ్, లెటర్ రైటింగ్ అంశాల్లో ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.

క్లరికల్ కేడర్ పరీక్ష విధానం:
మొత్తం 250 ప్రశ్నలకు 250 మార్కులుంటాయి. రెండున్నర గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది.
సెక్షన్ {పశ్నలు మార్కులు
టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 50 50
టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 50
టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ 50 50
జనరల్ అవేర్‌నెస్
(స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ) 50 50
టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ 50 50

పరీక్ష ఒకటే.. ప్రక్రియలు వేర్వేరు:
19 బ్యాంకుల రిక్రూట్‌మెంట్‌కు కామన్ రిటెన్ ఎగ్జామినేషన్‌కు శ్రీకారం చుట్టినా.. ఆయా బ్యాంకుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మాత్రం వేర్వేరుగానే ఉంటుంది. అంటే.. ప్రతి బ్యాంకు.. తమ పరిధిలోని ఖాళీల కోసం నిర్దిష్ట అర్హత ప్రమాణాలు పేర్కొంటూ ప్రత్యేక ప్రకటన జారీ చేస్తుంది. వాటికి సరితూగే అభ్యర్థులు కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ స్కోర్ కార్డ్‌ను జతచేస్తూ దరఖాస్తు చేసుకోవాలి.

ప్రతి సెక్షన్‌కూ కటాఫ్:
ఆబ్జెక్టివ్ పరీక్షలోని ఐదు సెక్షన్లకు వేర్వేరుగా కటాఫ్ నిర్ణయిస్తారు. ప్రతి సెక్షన్‌లోనూ కటాఫ్ దాటితేనే ఆ అభ్యర్థి రాసిన డిస్క్రిప్టివ్ పేపర్‌ను మూల్యాంకనం చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి అప్పటికే పొందిన మార్కుల నుంచి 0.25 మార్కులను తీసేస్తారు. ఈ పరీక్ష ఆధారంగా నియామకం చేపట్టే బ్యాంకుల జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని అసోసియేట్ బ్యాంకులు లేవు.

ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ) విధులు:
ప్రత్యేకంగా ఫలానా విషయం/సబ్జెక్ట్‌పైనే పనిచేయాలనే నిబంధన పీఓలకు వర్తించదు. అందుకే పోస్టింగ్‌లు విభిన్న డిపార్ట్‌మెంటల్స్‌లో ఉంటాయి. ప్రొబేషన్ కాలంలో భిన్న విధులు అంటే.. ఫారెక్స్ ఆపరేషన్స్, జనరల్ బ్యాంకింగ్, లోన్స్, మర్చెంట్ బ్యాంకింగ్, క్యాష్ డీలింగ్, చెక్ సెలక్షన్, చెక్ క్లియరెన్స్, బిల్ కలెక్షన్, లోన్ ప్రాసెసింగ్, రొటీన్‌గా ఉండే బ్యాంక్ వర్క్ ఇవన్నీ చేయిస్తారు. ప్రొబేషన్ వ్యవధి రెండేళ్లు. బ్యాంకింగ్‌కు సంబంధించి ప్రతి విభాగంపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రొబేషన్‌లో కనబర్చిన పని తీరును బట్టి హోదా కేటాయిస్తారు. అప్పు డు మేనేజేరియల్ విధు లు నిర్వహించాలి.

జీతాలు భారీగానే:
ఇటీవల పెంచిన జీతాల ఆధారంగా స్కేలులో బేసిక్ రూ.14,500. దీంతో కనిష్ట ప్రారంటభవేతనం రూ.27,000 వరకూ ఉంటుంది. దీనికి అదనంగా రూ. 10,000 వరకు ఇంటి అద్దె + ఇతర అలవెన్సులు ఉంటాయి. తక్కువ వడ్డీకి గృహ, వాహన, విద్యా రుణాలు బ్యాంక్ ఉద్యోగులు పొందొచ్చు.
పదోన్నతులు: పీఓ నుంచి స్కేల్-2 మేనేజర్ హోదాకు చేరు కోవడానికి నాలుగేళ్లు పడుతుంది. ఇంతకంటే వేగంగా ప్రమోషన్ అందుకోవాలంటే ‘సర్టిఫైడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ (సీఏఐఐబీ) పరీక్ష రాసి ప్రమోషన్ పొందొచ్చు. మేనేజర్ నుంచి సీనియర్ మేనేజర్ హోదాకు చేరుకోవడానికి రెండేళ్లు పడుతుంది. పీఓగా బ్యాంకులో చేరిన వారు ఈ స్థాయి వరకే ప్రమోషన్లు అందుకుంటారు అనే నియమమేదీ లేదు. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, బ్యాంక్ చైర్మన్ లాంటి ఉన్నతోద్యోగాలూ పొందొచ్చు.

క్లరికల్ కేడర్:
ఈ కేడర్ ద్వారా బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించిన వారికి క్లర్క్, క్యాషియర్, టైపిస్ట్ అనే మూడు రకాల పనులను ఒకటిగా చేసిన సీసీటీగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ప్రారంభంలో నెలకు రూ.13 వేలకు పైగా వేతనం లభిస్తుంది. పదోన్నతులను దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా ప్రయత్నించిన వారు.. ఐదు సంవత్సరాల్లో ఆఫీసర్‌గా జూనియర్ మేనేజ్‌మెంట్ స్థాయికి ప్రమోషన్ పొందొచ్చు. ఆ స్థాయి నుంచి క్రమంగా ప్రమోషన్ల ఆధారంగా జనరల్ మేనేజర్ హోదా వరకు చేరుకోవచ్చు. క్లర్క్‌గా కెరీర్ ప్రారంభించినవాళ్లు కనీసం చీఫ్ మేనే జర్ స్థాయి వరకు తప్పకుండా చేరుకునే అవకాశం ఉంటుంది.

ఐఐబీఎఫ్:
బ్యాంకింగ్ రంగంలోకి విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారు ఉంటారు. వీరందరికీ
వస్తున్న మార్పులకనుగుణంగా అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నేతృత్వంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(ఐఐబీఎఫ్) అనే సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ జేఏఐఐబీ, సీఏఐఐబీ అనే కోర్సులను ఆఫర్ చేస్తుంది. జేఏఐఐబీ కోర్సు పూర్తి చేస్తే ఒక ఇంక్రిమెంట్, సీఏఐఐబీ కోర్సు పూర్తి చేస్తే రెండు ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తున్నారు. మిగిలిన డిప్లొమో, సర్టిఫికెట్లకు ఆఫీసర్లతో సమానంగా నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.