Home Vidhya - విద్య Insurance Courses ఇన్సూరెన్స్


 
Insurance Courses ఇన్సూరెన్స్ PDF Print E-mail
నిబంధనల సరళీకరణతో ఇన్సూరెన్స్‌లో ప్రైవేట్ కంపెనీలు, ఫారిన్ కంపెనీలు చేరాయి. 1999 వరకు దేశంలో కేవలం 6 ఇన్సూరెన్స్ కంపెనీలే ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 44కు చేరింది. బీమాపై ప్రజల్లో అవగాహన పెరగడం, ఆదాయాల్లో పెరుగుదల, కంపెనీల మధ్య పోటీ...లాంటి కారణాలతో బీమా రంగంలో నిపుణుల ఆవశ్యకత పెరిగింది.

ఇన్సూరెన్స్‌లో సుశిక్షితులైన మానవ వనరులను అందించాలనే లక్ష్యంతో ఐఆర్‌డీఏ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఐఐఆర్‌ఎంను ఏర్పాటు చేశాయి. ఇక్కడి కోర్సులను లండన్‌లోని చార్టర్డ్ ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ (సీఐఐ) గుర్తించింది.

కోర్సులు:

- ఇంటర్నేషనల్ పీజీ డిప్లొమా ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్
- ఇంటర్నేషనల్ పీజీ డిప్లొమా ఇన్ జనరల్ ఇన్సూరెన్స్
- ఇంటర్నేషనల్ పీజీ డిప్లొమా ఇన్ రిస్క్ మేనేజ్‌మెంట్
వ్యవధి: ఏడాది. రెండు సెమిస్టర్లు.
అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ
గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు
వెబ్‌సైట్: www.iirmworld.org.in

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్-హైదరాబాద్
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్-ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్‌గా
అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ
వెబ్‌సైట్: www.ipeindia.org

ఇన్సూరెన్స్ కోర్సులు అందించే ఇతర సంస్థలు:
- నేషనల్ ఇన్సూరెన్స్ అకాడెమీ-పుణె
- బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ-గ్రేటర్ నోయిడా
- నేషనల్ లా యూనివర్సిటీ-జోధ్‌పూర్ ఇన్సూరెన్స్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఎంబీఏ(ఇన్సూరెన్స్)తోపాటు ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఎంఎస్ ఇన్సూరెన్స్ కోర్సు నిర్వహిస్తుంది.
- స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్-వారణాసి
- అమిటీ యూనివర్సిటీ-నోయిడా
- ఆపీజే స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్-న్యూఢిల్లీ
- బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ-న్యూఢిల్లీ
- నేషనల్ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-బెంగళూరు
- సింబయాసిస్ దూరవిద్య విధానంలో పీజీ డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్ కోర్సు అందిస్తోంది.
- చార్టర్డ్ ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్-లండన్(ఇన్సూరెన్స్‌లో డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, ఎమ్మెస్సీ కోర్సులు)
వెబ్‌సైట్: www.cii.co.uk

నేషనల్ ఇన్సూరెన్స్ అకాడెమీ-పుణె, ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో కోర్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ఉద్యోగాలిక్కడ:
ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇఫ్కో-టోకియో జనరల్ ఇన్సూరెన్స్, యాక్సెంచూర్, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ సెక్యూరిటీస్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, రెలిగేర్, మహేంద్ర ఇన్సూరెన్స్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్.

యాక్చూరియల్ సైన్స్:
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్, అవకాశాలు ఉన్న కోర్సు ఇది. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌ల్లో ఉన్నత శ్రేణి మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసినవాళ్లు; మ్యాథ్స్/స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్‌ల్లో పీజీ చేసినవాళ్లు ఈ కోర్సు చేస్తే ప్రయోజనం. కోర్సుకు నిర్ణీత వ్యవధి ఉండదు. ఈ కోర్సుకు దేశంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చూరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ) ప్రసిద్ధ సంస్థ. ఇందులో మూడురకాల మెంబర్‌షిప్‌లు ఉన్నాయి. అవి స్టూడెంట్ మెంబర్, అసోషియేట్ మెంబర్, ఫెలో మెంబర్. యాక్చూరీ అవార్డు పొందాలంటే 15 సబ్జెక్టులు పూర్తిచేయాలి. ప్రస్తుతం ఈ విభాగంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉండటంతో 10 సబ్జెక్టులు పూర్తిచేసినవాళ్లు రూ.6 లక్షలకు పైగా ఆరంభవేతనం అందుకుంటున్నారు.

జాబ్స్ ఇక్కడ:

యాక్చూరీ సైన్స్ చదివిన వాళ్లకు లైఫ్, జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్‌ల్లో, పెన్షన్ ఫండ్లు, రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. డిగ్రీ, పీజీ అభ్యర్థులకు ఎల్‌ఐసీ యాక్చూరీ అప్రెంటీస్‌షిప్ నిర్వహిస్తుంది. 18-25 ఏళ్ల వయసు వాళ్లు అర్హులు.

యాక్చూరియల్ కోర్సులు అందించే సంస్థలు:
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్
కోర్సు:
పీజీ డిప్లొమా ఇన్ యాక్చూరియల్ సైన్స్
వ్యవధి: 15 నెలలు (3 సెమిస్టర్లు)
అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనోమెట్రిక్స్, యాక్చూరియల్ సబ్జెక్టుల్లో ఎందులోనైనా 60 శాతం మార్కులు.
వయోపరిమితి: 30 ఏళ్లు మించరాదు.
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చూరీస్ ఆఫ్ ఇండియా
- అమిటీ యూనివర్సిటీ-ఎంఎస్సీ యాక్చూరియల్ సైన్స్ అండ్ అప్లికేషన్స్
- కురుక్షేత్ర యూనివర్సిటీ-బీఏ ఇన్సూరెన్స్ అండ్ యాక్చూరియల్ సైన్స్
- నార్సీమోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్- ఎంబీఏ(యాక్చూరియల్ సైన్స్)
- యూనివర్సిటీ ఆఫ్ కల్యాణి ఎల్‌ఐసీతో కలిసి -యాక్చూరియల్ సైన్స్‌లో పీజీ
- యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్-ఎంఎస్సీ యాక్చూరియల్ సైన్స్
- నేషనల్ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, బెంగళూరు-పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ యాక్చూరియల్ స్టడీస్