Home Vidhya - విద్య Pharmacy Education - ఫార్మసీ


 
Pharmacy Education - ఫార్మసీ PDF Print E-mail


బాగా వృద్ధి చెందుతోన్న రంగాల్లో ఫార్మసీ ఒకటి. మందులకు ఏటా పెరుగుతోన్న డిమాండ్ దృష్ట్యా ఫార్మసీ పరిశ్రమ విస్తరిస్తోంది.నూతన పరిశ్రమల ఏర్పాటు, బల్క్‌డ్రగ్ ప్రొడక్షన్, డ్రగ్ డెవలప్‌మెంట్, ఫార్ములేషన్‌లో... ఆసియాలోనే భారత దేశం ముందుంది. ఫార్మసీలో డి.ఫార్మసీ, ఫార్మ్.డి, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులతో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఫార్మసీలో వివిధ కోర్సుల వివరాలు చూద్దాం...

డిప్లొమా ఇన్ ఫార్మసీ(డి.ఫార్మసీ): ఇది రెండేళ్ల కోర్సు. కోర్సులో చేరడానికి అర్హత ఇంటర్మీడియెట్(ఎంపీసీ/బైపీసీ). రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో దాదాపు 62 ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్ మార్కులతో ప్రవేశం లభిస్తుంది.

బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ(బి.ఫార్మసీ): ఇది నాలుగేళ్ల కోర్సు. ఈ కోర్సులో చేరడానికి అర్హత: ఇంటర్మీడియెట్(ఎంపీసీ/బైపీసీ) లేదా డి.ఫార్మసీ. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని దాదాపు 290 ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును అందిస్తున్నాయి. వీటిల్లో సుమారు 25వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా.. 50 శాతం సీట్లను ఎంపీసీ అభ్యర్థులతో, 50 శాతం సీట్లను బైపీసీ అభ్యర్థులతో భర్తీ చేస్తారు.

డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మ్.డి): ఫార్మసీలో మెరుగైన విద్యకోసం.. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. ప్రవేశపెట్టిన వినూత్న కోర్సే.. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మ్.డి). ఈ కోర్సులో ప్రవేశానికి అర్హత.. ఇంటర్మీడియెట్(ఎంపీసీ/ బైపీసీ). కోర్సు వ్యవధి ఆరేళ్లు. రాష్ట్రంలో దాదాపు 23 కళాశాలలు ఫార్మ్.డి. కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో 690 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ( బీఫార్మ్) విద్యార్థులకు కూడా ఫార్మ్.డి. కోర్సు చేసుకోవచ్చు. దీనికోసం పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పీజీఈసెట్) రాయాలి. వీళ్లకు ఈ కోర్సు వ్యవధి మూడేళ్లు. ఈ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 70 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

మాస్టర్ ఆఫ్ ఫార్మసీ(ఎంఫార్మసీ): బీఫార్మసీ తర్వాత ఉన్నత విద్య చదవడానికి అవకాశం కల్పిస్తున్న కోర్సు ఎంఫార్మసీ. ఈ కోర్సులో భిన్న స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి రెండేళ్లు. రాష్ట్రంలో దాదాపు 100 కాలేజీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో దాదాపు 4 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఫార్మసీ కోర్సులో పీజీఈసెట్ లేదా గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్) స్కోర్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

పీహెచ్‌డీ: బిట్స్, నైపర్, మణిపాల్ యూనివర్సిటీలు ఫార్మసీలో వివిధ స్పెషలైజేషన్లతో పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వివరాలకు ఆయా వర్సిటీల వెబ్‌సైట్లు చూడొచ్చు.

అవకాశాలు: ఫార్మసీ అభ్యర్థులు సొంతంగా ఫార్మసీలను స్థాపించుకొని స్వయం ఉపాధి పొందొచ్చు. డీఫార్మసీ/బీఫార్మసీ అభ్యర్థులకు.. ఔషధ తయారీ సంస్థల్లో ప్రారంభస్థాయిలో అనలిస్ట్, క్వాలిటీ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్.. మధ్యస్థాయిలో అసిస్టెంట్ మేనేజర్, సూపర్‌వైజర్ స్థాయి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఫార్మసీ రంగానికి సంబంధించి ఎంత ఉన్నత విద్యను అభ్యసిస్తే... అంత ఉన్నతస్థాయికి ఎదగొచ్చు. ఎంఫార్మసీ/పీహెచ్‌డీ... వంటి కోర్సులను చేయడం ద్వారా ఉన్నత ఉద్యోగాలు, పరిశోధనల్లో పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. బోధన రంగంలోనూ లెక్చరర్లు, ప్రొఫెసర్లుగా స్థిరపడొచ్చు. ప్రభుత్వ రంగంలో.. డిప్లొమా అభ్యర్థులను ఫార్మాసిస్ట్‌లుగా నియామించుకుంటారు. బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ అభ్యర్థులు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు అర్హులు.

విదేశాల్లోనూ ఫార్మసీ అభ్యర్థులకు చక్కని అవకాశాలు ఉన్నాయి. ఫార్మసిస్ట్‌గా ప్రాక్టీస్ చేయాంటే మాత్రం అక్కడి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. హాస్పిటల్ డిస్పెన్సరీల్లో ఫార్మ్.డి అభ్యర్థులను నియమించాలనే నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ కోర్సుతోపాటు క్లినికల్ రీసెర్చ్‌లో ‘సాస్’, ఇతర సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటే ఎన్నో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

ఆసుపత్రుల్లోనే కాకుండా.. క్లినికల్ రీసెర్చ్ సంస్థలు, డ్రగ్ డెవలప్‌మెంట్, క్లినికల్ ట్రయల్స్, క్లినికల్ ఫార్మసీ విభాగాల్లోనూ వీరికి అవకాశాలుంటాయి. అంతేకాకుండా అమెరికాలో ఫార్మసీ ఉద్యోగాలకు అవసరమైన ‘నార్త్ అమెరికన్ ఫార్మసిస్ట్ లెసైన్సర్ ఎగ్జామినేషన్ (నాప్‌లెక్స్)కు హాజరయ్యే అర్హత ఈ కోర్సుతో లభిస్తుంది.

ఫార్మ పీజీ కోర్సులకు జీప్యాట్: గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్).. దేశ వ్యాప్తంగా వివిధ ఇన్‌స్టిట్యూట్‌లు/యూనివర్సిటీలు ఆఫర్ చేసే మాస్టర్ ఆఫ్ ఫార్మసీ(ఎం.ఫార్మసీ) కోర్సుల్లో ప్రవేశించడానికి వీలు కల్పించే పరీక్ష. ఇందులో మంచి ర్యాంక్ సాధించడం ద్వారా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్), సెంట్రల్ యూనివర్సిటీలు మొదలు.. దేశంలో వందల సంఖ్యలో ఉన్న సంప్రదాయ యూనివర్సిటీల్లో ప్రవేశం లభిస్తుంది.

ఫార్మసీలో మేనేజ్‌మెంట్ కోర్సులు:
ఔషధాలను మార్కెట్‌లో విక్రయించడానికి సరైన వ్యాపార మెలకువలు పాటించడం అనివార్యమైంది. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పలు విద్యాసంస్థలు ఫార్మసీ రంగంలో మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సు చేయడం ద్వారా ఫార్మాస్యుటికల్, కెమికల్, బయోటెక్నాలజీ సంస్థలు, పరిశోధన, విద్యాసంస్థల్లో మేనేజిరియల్ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పంజాబ్-ఎంబీఏ(ఫార్మా) కోర్సు అందిస్తోంది. బీఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులు.
వెబ్‌సైట్: www.niper.nic.in

నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్: ముంబై- ఎంబీఏ(ఫార్మాస్యుటికల్ మేనేజ్‌మెంట్) కోర్సును అందిస్తోంది. బి. ఫార్మసీ పూర్తిచేసినవాళ్లు అర్హులు.
వెబ్‌సైట్: www.nmims.edu

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ మార్కెటింగ్, లక్నో - పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఫార్మా మార్కెటింగ్) సెల్ఫ్ స్టడీ పద్ధతిలో అందిస్తోంది. ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చే సిన వారు అర్హులు.
వెబ్‌సైట్: www.iipmindia.com

జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లు:
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్): పిలాని(రాజస్థాన్), హైదరాబాద్ క్యాంపస్‌లు: బీఫార్మసీ(ఆనర్స్), ఎంఫార్మసీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
వెబ్‌సైట్: www.bitsadmission.com

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్):
దీనికి దేశం వ్యాప్తంగా పలు చోట్ల(మెహాలీ, హైదరాబాద్, కోల్‌కతా, గుహవాటి, అహ్మదాబాద్, రాయ్‌బరేలీ, హాజీపూర్) క్యాంపస్‌లు ఉన్నాయి. ఇవి ఫార్మసీలో ఎంఎస్(ఫార్మా) కోర్సులు అందిస్తున్నాయి. నైపర్- కామన్ ఎంట్రన్స్ టెస్ట్/జీప్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది.
వెబ్‌సైట్: www.niper.ac.in

మణిపాల్ యూనివర్సిటీ:
మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సెన్సైస్ బీఫార్మసీ, డి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఫార్మ్-డి కోర్సులను ఆఫర్ చేస్తుంది.
వెబ్‌సైట్: www.manipal.edu

జేఎస్‌ఎస్ ఫార్మసీ కాలేజ్-ఊటీ: ఈ ఇన్‌స్టిట్యూట్ బీఫార్మసీ, డి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఫార్మ్-డి కోర్సులను ఆఫర్ చేస్తుంది.
వెబ్‌సైట్: www.jsscpooty.org

బెనారస్ హిందూ యూనివర్సిటీ:
ఈ సంస్థ బి. ఫార్మసీ, ఎం.ఫార్మసీ, కోర్సులను ఆఫర్ చేస్తుంది.
వెబ్‌సైట్: www.itbhu.ac.in

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -మెస్రా (రాంచీ):
ఈ ఇన్‌స్టిట్యూట్ బి. ఫార్మసీ, ఎం. ఫార్మసీ, ఎంఎస్-ఫార్మసీ కోర్సులను ఆఫర్ చేస్తుంది.
వెబ్‌సైట్: www.bitmesra.ac.in

నర్సింగ్

ఓ అంచనా ప్రకారం... 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా...2 కోట్ల మంది నర్సులు అవసరం. వృద్ధులు, రోగుల సంఖ్య పెరగడం, నూతనంగా విజృంభిస్తున్న వ్యాధులే దీనికి కారణం. నర్సింగ్ నేడు జాబ్ గ్యారెంటీ వృత్తిగా మారడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువమంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు. నర్సింగ్‌లోనూ వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం...

బీఎస్సీ నర్సింగ్: నాలుగేళ్ల వ్యవధి ఉన్న ఈ కోర్సును ఇంటర్(బైపీసీ) ఉత్తీర్ణత తో చేయొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 6 ప్రభుత్వ కాలేజీలు.. 201 ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో... 10,498 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సీటు పొందడానికి.. ఇంటర్ మార్కులే కీలకం. ఎందుకంటే.. నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి ప్రత్యేక అర్హత పరీక్ష లేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సీట్లు భర్తీచేస్తుంది.

జీఎన్‌ఎం: జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం). కోర్సు కాలవ్యవధి.. మూడున్నరేళ్లు. ఏఎన్‌ఎం చేసినవారికి ఏడాది సడలింపునిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 234 కాలేజీల్లో ఈ కోర్సు ఉంది. ఇందులో చేరడానికి కనీస అర్హత ఇంటర్‌లో బైపీసీ.

ఏఎన్‌ఎం: యాక్సిలరీ నర్స్ మిడ్‌వైఫ్(ఏఎన్‌ఎం) కోర్సు చేయాలంటే.. టెన్త్ పాస్ కావాలి. ఇది ఏడాదిన్నర కోర్సు. ఏఎన్‌ఎం చేసినవారు నర్సుగా చేరొచ్చు.

మిలిటరీ నర్సింగ్ సర్వీస్ (ఎంఎన్‌ఎస్): ఇందులో చేయూలంటే.. ఇంటర్(బైపీసీ)లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. వయస్సు 17 నుంచి 24 ఏళ్లు. పెళ్లికాని యువతులు, భర్త నుంచి విడాకులు తీసుకున్నవారు, వితంతువులు అర్హులు. రాత పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. కోర్సు పూర్తయ్యాక 4 లేదా ఐదేళ్లు మిలిటరీ హాస్పిటల్‌లో పనిచేస్తామని బాండ్ రాయూలి. ఈ కోర్సును దేశవ్యాప్తంగా 16 సంస్థలు అందిస్తున్నారుు. మన రాష్ట్రంలో సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

విదేశాల్లోనూ అవకాశాలు:
నర్సింగ్ కోర్సులు చేసినవారికి రాష్ట్ర, కేంద్ర స్థారుులో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులే కాకుండా అనేక విదేశీ అవకాశాలు కూడా ఉన్నాయి. వుుఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో నర్సుల కొరత ఎక్కువగా ఉండటంతో ఆ అవసరాలు తీర్చేందుకు భారత్ ప్రధాన వేదికగా వూరుతోంది. ఈ క్రవుంలో అమెరికా, యుూకే, కెనడా, ఆస్ట్రేలియూ, ఐర్లాండ్, న్యూజిలాండ్, సింగపూర్ వంటి దేశాలు వున దేశంలో నర్సింగ్ ఉత్తీర్ణులకు ప్రధాన గవ్యూలని చెప్పొచ్చు.

వాటిలో అవకాశాలు సొంతం చేసుకోవాలంటే.. అక్కడి ప్రభుత్వాలు నిర్వహించే అర్హత పరీక్షలు రాయూలి. ఉదాహరణకు అమెరికాలో నర్స్‌గా స్థిరపడాలంటే కమిషన్ ఆన్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఫారిన్ స్కూల్స్ (సీజీఎఫ్‌ఎన్‌ఎస్) నిర్వహించే నేషనల్ కౌన్సిల్ లెసైన్సర్ ఎగ్జామినేషన్ ఫర్ రిజిస్టర్డ్ నర్సెస్ (ఎన్‌సీఎల్‌ఈఎక్స్- ఆర్‌ఎన్)లో ఉత్తీర్ణత సాధించాలి.

అదేవిధంగా కెనడాలో అడుగుపెట్టాలంటే.. కెనడియున్ రిజిస్టర్డ్ నర్స్ ఎగ్జామినేషన్ (సీఆర్‌ఎన్‌ఈ)లో ఉత్తీర్ణత తప్పనిసరి. వీటితోపాటు గల్ఫ్ దేశాలు కూడా భారీఎత్తున భారత నర్సింగ్ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారుు. నర్సింగ్‌కు సంబంధించి పరిజ్ఞానంతోపాటు ఇంగ్లిష్ భాషపై పట్టుంటే ఎంతో సులువుగా విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అమెరికాలో ప్రారంభంలోనే నెలకు ఐదు వేల డాలర్ల వేతనం లభిస్తోంది.
కెరీర్:
ముఖ్యంగా నర్సింగ్ పూర్తిచేసినవాళ్లకు ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు, నర్సింగ్‌హోంలు, ప్రైవేటు క్లినిక్‌లు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, వివిధ ప్రయివేటు పరిశ్రమల్లోని ఇండస్ట్రియల్ హౌసెస్‌లు, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, రైల్వేల్లోని ఆరోగ్య విభాగాల్లో డిమాండ్ ఉంది.

ఎంఎస్సీ నర్సింగ్:
ఈ కోర్సులో ప్రవేశానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏటా జూలై/ఆగస్టులలో ప్రకటన విడుదల చేస్తుంది. 55 శాతం మార్కులతో బీఎస్సీ(నర్సింగ్) లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులు దీనికి అర్హులు. పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17 కాలేజీల్లో ఎంఎస్సీ నర్సింగ్ అందుబాటులో ఉంది.

ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు:
నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)
మెడి కల్ సర్జికల్ నర్సింగ్, పీడియాట్రిక్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, సైకియాట్రిక్ నర్సింగ్ స్పెషలైజేషన్లతో ఎంఎస్సీ నర్సింగ్ అందిస్తుంది.
అర్హత: నర్సింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ(10+2+4 విధానంలో).
వెబ్‌సైట్:nims.ap.nic.in

శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (స్విమ్స్) -తిరుపతి: ఈ సంస్థ కూడా ఎంఎస్సీ నర్సింగ్ కోర్సు ఆఫర్ చేస్తుంది.
వెబ్‌సైట్: http://svimstpt.ap.nic.in