Home Vidhya - విద్య ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న వర్సిటీలేవి?


 
ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న వర్సిటీలేవి? PDF Print E-mail
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (మ్యాథమెటికల్ సెన్సైస్) కోర్సును ఆఫర్ చేస్తుంది.
ఐదేళ్లపాటు ఉండే ఈ కోర్సులో చేరడానికి అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌లతో ఇంటర్మీడియెట్. యూనివర్సిటీ నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. సంబంధిత నోటిఫికేషన్ ప్రతి ఏటా మే నెలలో వెలువడుతుంది.
వివరాలకు: www.uohyd.ac.in

ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు:
ఆదికవి నన్నయ యూనివర్సిటీ-రాజమండ్రి
కోర్సు: ఎంఎస్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్
అర్హత: ఇంటర్మీడియెట్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్)
వివరాలకు: www.nannayauniversity.info
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్
కోర్సు: ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్)
{పవేశం: ఐఐటీ-జేఈఈ ర్యాంక్ ఆధారంగా
వివరాలకు: www.iitk.ac.in
ఇండియన్ స్కూల్స్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్
కోర్సు: ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్)
{పవేశం: ఐఐటీ-జేఈఈ ర్యాంక్ ఆధారంగా
వివరాలకు: www.ismdhanbad.ac.in