Home విజ్ఞానం టెలివిజన్‌ను చీకట్లో చూడవచ్చా?


 
టెలివిజన్‌ను చీకట్లో చూడవచ్చా? PDF Print E-mail
శాటిలైట్ యుగంలో వినోదం కోసం, విషయ పరిజ్ఞానం కోసం ఎక్కువమంది టీవీని ఆశ్రయిస్తున్నారు. టీవీని ఎంతదూరం నుంచి చూడాలి? చీకట్లో చూడవచ్చా? అనే సందేహం కలుగుతుంది. ముఖ్యంగా తలుపులన్నీ మూసి, దీపాలను ఆర్పేసి చీకటిలో కూర్చొని టీవీ చూస్తే బొమ్మ స్పష్టంగా కన్పిస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ అలా చూస్తే కళ్లు త్వరగా అలసిపోతాయి. దృష్టిదోషాలు కలగవచ్చు.

అందుకే టీవీ చూసేప్పుడు గదిలో వెలుతురు ఉండేలా చూసుకుంటే మన కళ్లు త్వరగా అలసిపోవు. కంటికి దృష్టి లోపం కలగకుండా ఉంటుంది. టీవీని కనీసం రెండున్నర మీటర్లు లేదా ఏడడుగుల దూరం నుంచి చూడడం ఆరోగ్యకరం. మనం కూర్చున్నప్పుడు టీవీ తెర మధ్య భాగం కంటి దగ్గర సుమారు 10 నుంచి 15 డిగ్రీల కోణం ఉంటే మెడ కండరాలు ఎక్కువ శ్రమకు గురికావు. అందుకే టీవీ చూసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో మరీ జాగ్రత్త అవసరం.