Home విజ్ఞానం గడియారం క్లాక్ వైజ్‌గా ఎందుకు తిరుగుతుంది?


 
గడియారం క్లాక్ వైజ్‌గా ఎందుకు తిరుగుతుంది? PDF Print E-mail
‘అన్ని గడియారాలు ఎడమవైపు నుంచి కుడివైపుకు ‘క్లాక్ వైజ్’గా తిరుగుతాయి, ఎందుకు!’ అని కొంతమంది పిల్లలు ఆశ్చర్యపడతారు. నిజానికి యంత్రంతో పనిచేసే గడియారాలు మొదట తయారయింది ఉత్తరార్ధగోళంలోని దేశాల్లోనే. అక్కడ గడియారాల్లో అంకెలను సూచించే ముళ్లు ఎడమ నుంచి కుడి వైపుకు తిరిగేలా అమర్చాలని గడియారం నిర్మాతలు భావించారు. ఇందుకు కారణం అక్కడ అంతకుముందే రూపొందించిన సన్ డయల్స్.

వాటిని ఎండవాలు ప్రకారం రూపొందించారు. ఆ గడియారాల్లో సూర్యుని వెలుగు నీడల చలనాన్ని బట్టి ఎడమ నుంచి కుడికి ముళ్లు తిరిగే విధంగా వాటిని తయారు చేశారు. సూర్యకాంతికి వ్యతిరేక దిశలో నీడలు ఏర్పడతాయన్న అంశం ఆధారంగా వాటిని రూపొం దించారు. ఉత్తరార్ధగోళ దేశాల్లో ముందుగా గడియారం తయారుకాకపోయుంటే కుడి నుంచి ఎడమకు తిరిగే విధంగా ఉండేదేమో!