Home విజ్ఞానం పాలిమర్ ద్రవ స్పటి కాలు దేనికి వాడతారు?


 
పాలిమర్ ద్రవ స్పటి కాలు దేనికి వాడతారు? PDF Print E-mail

పాలిమర్ ద్రవ స్పటికాల (లిక్విడ్ క్రిస్టల్స్) వలన అనేక ఉపయోగాలు ఉండటం వలన వీటిపై అందరి దృష్టి పడింది. వీటిని కూడా లయోట్రోపిక్, థర్మో ట్రోపిక్ ద్రవ స్పటికాలుగా వర్గీకరిస్తారు. జన్యుపరంగా సాగుతున్న పరిశోధనలలో లయోట్రోపికల్ పాలిమర్ ద్రవ స్పటికాలు ఎంతో ఉపయోగపడతాయి. అత్యంత బలమైన దారాల ఉత్పత్తికి వీటిని వాడుతున్నారు. కెల్వార్ 29, కెల్వార్ 49 వంటి అనేక ఉత్పత్తులను ఎంతో బలం గల వాటిని ఇప్పటికే ఉత్పత్తి చేస్తున్నారు.

బాగా హెచ్చు నిరోధాన్ని తట్టుకోవాల్సిన వస్తువుల తయారికి వీటిని ఉపయోగిస్తారు. లోపల ధరించే బుల్లెట్ ఫ్రూఫ్‌ల నిర్మాణానికి, అన్ని రకాల కేబుల్స్ నిర్మాణంలోను, ప్లాస్టిక్ రీ ఇన్ ఫార్స్‌మెంట్స్‌లోను కెల్వార్-49ని వాడుతున్నారు. వీటిని ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలకు వెళ్లే పరికరాల నిర్మాణంలోను, వాహక నౌకల నిర్మాణంలోను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే వీటికి కావల్సిన బలంతో పాటు ఎంతో తేలికగా ఉంటాయి.