Home విజ్ఞానం ఆఫ్రికాలో తొలి ముస్లిం దేశం


 
ఆఫ్రికాలో తొలి ముస్లిం దేశం PDF Print E-mail
మొరాకో ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం. దీని రాజధాని రబత్. ఈ ప్రాంతంలో క్రీస్తు పూర్వం 8 వేల సంవత్సరాల నాటికే మనుషులు నివసించారనటానికి ఆధారాలున్నాయి. ఇది ఆఫ్రికా ఖండంలో మొదటి ముస్లిం దేశం. ముస్లింల విస్తరణ ఈ ప్రాంతంలో 7వ శతాబ్దంలో ప్రారంభమయ్యింది. క్రీ.శ.670లో మొదటిసారి గా ఇస్లాం పాలకులు ఉత్తరాఫ్రికాలోని తీర ప్రాంతాల్లో గల మైదానాన్ని ఆక్రమించుకున్నారు.

అరబ్బులు వారితో పాటుగా వారి సంప్రదాయాల్ని, సంస్కృతులను, ఇస్లాం మతాన్ని తీసుకొని వచ్చారు. దానితో ఈ ప్రాంతంలో ఉండే బెర్బర్ జాతీయులు ఎక్కువ మంది ముస్లింలుగా మారారు. అరబ్బులు ఇక్కడ నెకోర్, బార్గవట రాజ్యాలను ఏర్పర్చుకున్నారు. ఇద్రీస్ అబ్దుల్లా అనే ముస్లింరాజు ఇద్రీసిద్ సామ్రాజాన్ని స్థాపించాడు. వీరు మొరాకోకి ఫెస్‌ని రాజధానిగా ఏర్పర్చుకున్నారు. వీరి పాలన తర్వాత మొరాకో ప్రాంతంలోని అరబ్బులు రాజకీయంగా నియంత్రణను కోల్పోయారు.