Home విజ్ఞానం అండమాన్ నికోబార్ దీవులు


 
అండమాన్ నికోబార్ దీవులు PDF Print E-mail

 

అండమాన్ నికోబార్ దీవుల సమూహం భారతదేశ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటి. వీటి రాజధాని నగరం పోర్ట్‌బ్లెయిర్. అండమాన్ అనే పేరు హండుమాన్ అనే పదం నుంచి పుట్టింది. హనుమంతుడిని హండుమాన్ అని పిలుస్తారు. మలయ్ భాషలో నికోబార్ అంటే నగ్న మనుషుల భూమి అని అర్థం.

17వ శతాబ్దంలో మహరాష్ట్రీయులు ఈ దీవులను ఆక్రమించారు. ఆ తర్వాత అవి బ్రిటిష్ ఇండియాలో భాగమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నేతాజీ నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ వీటిని స్వాధీన పర్చుకుంది. జనరల్ లోక్‌నాథన్ గవర్నర్‌గా తాత్కాలిక స్వతంత్ర భారత దేశ ప్రభుత్వం నెలకొల్పారు. నేతాజీ మరణంతో ఈ దీవులు తిరిగి బ్రిటిష్ వారి స్వాధీనంలోకి వెళ్లిపోయాయి. 1947లో ఇవి స్వతంత్ర భారతదేశంలో భాగం అయ్యాయి.