Home విజ్ఞానం లేసర్ కిరణాలు ఎవరు కనుగొన్నారు?


 
లేసర్ కిరణాలు ఎవరు కనుగొన్నారు? PDF Print E-mail

లేసర్ అనే ఇంగ్ల్లిషు మాట ఒక సంక్షిప్త పదం. దీని పూర్తి పేరు ‘‘లైట్ యాంప్లికేషన్ బైస్టిమ్‌లేటేడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్’’. (దీన్ని ‘‘లేజర్ అని కూడా పలుకుతారు)
చంచలకాంతి శక్తిని లేక విద్యుచ్ఛక్తిని అచంచల (చలనం లేని) శక్తిగా మార్చడాన్ని ‘‘లేసర్’’ అంటారు.
లేసర్ కిరణాలు ఋజువర్తనులు, అచంచలములు, మోనోక్రామటిక్, గాఢమైనవి.
మొట్టమొదట లేసర్ కిరణాలను 1960లో అమెరికాకు చెందిన టి.హెచ్. మైమన్ తయారు చేశాడు. గులాబీ రంగులో ఉన్న రూబీ కర్రను ఉపయోగించి దీన్ని అల్యూమినియం ఆక్సైడ్‌లో, 0.5% క్రోమియం ఆక్సైడ్‌ను కలిపి తయారు చేశాడు. రూబీ కర్ర రెండు కొనలను నగిషీ పెట్టి, నునుపుగా తయారు చేసి రెండు కొనలకు వెండిపూత పెట్టాడు.

ఒక వైపు ఎక్కువ పూతపూసి, మరొక వైపు 50% కాంతి బయటకు వెళ్లేలా పూత పూశాడు. ఈ కర్రను గుండ్రంగా ఉన్న జీనాన్ ఫ్లాష్ ల్యాండ్ మధ్యలో ఉంచాడు. కరెంట్ ద్వారా జీనాన్ ల్యాండ్‌లోని కాంతిని రూబీ కర్రపై పడేలా చేయగా లేసర్ ఏర్పడింది. ఫలితంగా 50% వెండిపూత వున్న రెండవ భాగం నుండి కళ్లు మిరుమిట్లు గొలిపే ఎర్రని లేసర్ కిరణం వెలువడింది. ఆతర్వాత లేసర్‌పై అనేక పరిశోధనలు జరిగాయి.

Theodore Harold "Ted" Maiman (July 11, 1927 – May 5, 2007) was an American Engineer and physicist credited with the invention of the first working laser. Maiman’s laser led to the subsequent development of many other types of lasers.The laser was successfully fired on May 16, 1960. In a July 7, 1960 press conference in Manhattan, Maiman and his employer, Hughes Aircraft Company, announced the laser to the world.Maiman was granted a patent for his invention, and he received many awards and honors for his work. Maiman's experiences in developing the first laser and subsequent related events are described in his book, The Laser Odyssey.