Home విజ్ఞానం పిన్‌కోడ్ ఎందుకు..?


 
పిన్‌కోడ్ ఎందుకు..? PDF Print E-mail

మనదేశం చాలా విశాలమైనది. జనాభా కూడా ఎక్కువే. అనేక ప్రాంతాలు, నగరాలు, పట్టణాలు, పల్లెలు ఉన్నాయి. అలాగే అనేక భాషలు, లిపులు ఉన్నాయి.

మనదేశంలో అనేక వేల పోస్టాఫీసులు ఉన్నాయి. ఈ పోస్టాఫీసుల ద్వారా ప్రజలకు ఉత్తరాలు, పార్శిళ్లు మొదలైన వాటిని బట్వాడా చేయవలసి ఉంటుంది. వీటిని ప్రాంతాల వారీగా విభజించి ఎలాంటి తికమక లేకుండా అందజేయడం కోసం ‘‘పిన్‌కోడ్’’ ఏర్పాటుచేశారు.
PIN అంటే Postal Index Number కు సంక్షిప్త పదం. పిన్‌కోడ్ సౌలభ్యం కోసం దేశాన్ని 8 పోస్టల్ మండలాలు (జోన్స్) గా విభజించారు. ప్రతిమండలంలో మళ్లీ సర్కిల్స్ ఉంటాయి. పిన్‌కోడ్ పద్ధతిలో ఆరు సంఖ్యలు ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాద్-1ని 500001 గా పేర్కొంటారు.

ఇందులో మొదటి అంకె దేశంలోని మండలాన్ని సూచిస్తుంది. రెండు, మూడు అంకెలు సబ్‌జోన్‌ను సూచిస్తాయి. అంటే పోస్టు ఏ ప్రాంతానికి వెళ్లవలసిందీ సూచిస్తాయి. తర్వాత ఉండే మూడు అంకెలు ఏ జిల్లాలో సార్టింగ్ అయ్యేది ఏ ఊరికి చేరవలసిందీ తెలుపుతాయి. ఆరుసంఖ్యలు కలిసి ఆ టపా ఏ పోస్టాఫీసుకు లేక డెలివరీ విభాగానికి చేరవలసిందీ సూచిస్తాయి. మహానగరాల కంటే పల్లెల PIN కోడ్‌ను పరిశీలిస్తే ఈ వివరాలు స్పష్టంగా తెలుస్తాయి.