Home విజ్ఞానం అమెజాన్ నది ప్రత్యేకత ఏమిటి?


 
అమెజాన్ నది ప్రత్యేకత ఏమిటి? PDF Print E-mail

ప్రపంచంలో అతి పొడవైన నది నైలు. పెద్దనది అమెజాన్. కాని పొడవు విషయంలో అమెజాన్ రెండవ స్థానంలో వుంది. ఉత్తర బ్రెజిల్ నుండి అట్లాంటిక్ సముద్రం వరకూ 6448 కిలోమీటర్ల దూరం అమెజాన్‌నది ప్రవహిస్తుంది. పెరూలోని ఆండీస్‌పర్వతాలలో పుట్టిన మరనోస్, వయాలి అనే ప్రవాహాల కలయిక వల్ల ఇది ప్రారంభవుతుంది.

కొలంబస్ సముద్ర యాత్రల్లో పాల్గొన్న అతని సిబ్బందిలో ఒకరైన యానెజ్ పింజోస్ అనే స్పెయిన్ దేశస్థుడు 1499లో అమెజాన్ నదిని మొదటిసారిగా కనుగొన్నాడు.అమెజాన్ నది పరీవాహక ప్రాంత విస్తీర్ణం మూడు మిలియన్ చదరపు మైళ్లు వుంటుంది. అంటే ఇది దక్షిణ అమెరికా భూభాగంలో దాదాపు అయిదవ వంతు అన్నమాట.

అమెజాన్ నది ఉపనదులన్నీ వేర్వేరు రంగులలో వుంటాయి. ఆండీస్ పర్వత ప్రాంతంలో తెలుపు లేదా పసుపు రంగులో, వాయవ్య బ్రెజిల్, వెనిజులాలో ఉపనదులు నల్లగా వుంటాయి.
బ్రెజిల్‌లో సగం వరకూ అమెజాన్ పల్లపు ప్రాంతాలే. అమెజాన్ నది లోతు కూడా చాలా ఎక్కువ.