Home విజ్ఞానం పారాచ్యూట్


 
పారాచ్యూట్ PDF Print E-mail

వాతావరణంలో నుండి కిందకు పడే వస్తువు యొక్క వేగాన్ని తగ్గించే గొడుగు వంటి సాధనాన్ని పారాచ్యూట్ లేదా గాలిగుమ్మటం అంటారు. కింద పడే వస్తువు పైన పని చేసే రెండు బలాలు... అంటే ఒకటి వాయునిరోధం, రెండు భూమ్యాకర్షణ శక్తి సూత్రాల ఆధారంగా పారాచ్యూట్ పని చేస్తుంది. నైలాన్ దారంతో తయారైన పారాచ్యూట్‌లో కిందికి దిగే వ్యక్తికి కుదుపులకు తగ్గించడానికి పారాచ్యూట్ గుడ్డకు రంధ్రాలు చేస్తారు.

భూమ్యాకర్షణ శక్తి వస్తువును బలంగా కిందకు లాగుతుంది. అయితే వస్తువు కదలికలను గాలి అడ్డగిస్తుంది. తక్కువ వేగంలో గాలి నిరోధం కంటే భూమ్యాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. మొనతేలి ఉండే వస్తువుల కంటే విశాలంగా ఉండే ఉపరితలాలకు నిరోధకం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పారాచ్యూట్ గుడ్డ పూర్తిగా తెరుచుకోగానే కిందకు దిగే మనిషి వేగాన్ని ఒక్కసారిగా తగ్గిస్తుంది.