Home విజ్ఞానం మొదటి స్కైలాబ్‌ను ఎప్పుడు ప్రయోగించారు?


 
మొదటి స్కైలాబ్‌ను ఎప్పుడు ప్రయోగించారు? PDF Print E-mail

భూకక్ష్యలో అంతరిక్ష ప్రయోగశాలను నెలకొల్పడం కోసం మొట్టమొదటి స్కైలాబ్ (ఓ్గఔఅఆ)ను అమెరికా 1973 మేనెలలో ప్రయోగించింది. విశాలంగా వుండే విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలే స్కైలాబ్. ఈ ప్రయోగశాలలో ముగ్గురు శాస్త్రజ్ఞులు భారరహిత స్థితి, రోదసిలో జీవకణ పరిస్థితులు మొదలైన వాటి గురించి విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించారు.

రెండవ స్కైలాబ్‌లో రోదసి యాత్రికులు రోదసిలో 28 రోజులు ఉండి అనేక ప్రయోగాలు జరిపారు. మంచి ఫలితాలు వచ్చాయి.

1973 జులై 28 తేదీన మూడవ స్కైలాబ్‌ను ప్రయోగించారు. ఇది 59 రోజులపాటు రోదసి గురించి అధ్యయనాలు జరిపింది.

నాలుగవ స్కైలాబ్‌ను 1973 నవంబర్ 16 తేదీన ప్రయోగించారు. ఇది భూమికి 480 కిలోమీటర్ల దూరంలో 84 రోజులు ఉంది. అయిదు సంవత్సరాల తర్వాత ఈ స్కైలాబ్ పాడైపోవడం ప్రారంభమైంది. 77 టన్నుల బరువుండే ఈ స్కైలాబ్ బద్దలై 1979 జులై 11న దీని భాగాలు కొన్ని ఆస్ట్రేలియాలోనూ, హిందూ మహాసముద్రంలోనూ పడిపోయాయి. ఆ రోజుల్లో ఈస్కైలాబ్ గురించి ప్రజలలో కలిగిన భయందోళనలు అంతా యింతా కాదు! అయితే అదృష్టవశాత్తూ ఇది ఎటువంటి ప్రాణనష్టం కలిగించలేదు.

 

Skylab was a space station launched and operated by NASA and was the United States' first space station. Skylab orbited the Earth from 1973 to 1979, and included a workshop, a solar observatory, and other systems. It was launched unmanned by a modified Saturn V rocket, with a weight of 77 tones.